58 దేశాల్లో పర్యటించిన మోడీ…ఖర్చెంతో తెలుసా?

58 దేశాల్లో పర్యటించిన మోడీ…ఖర్చెంతో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై వస్తున్న విమర్శలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మోడీ 2015 నుండి 58 దేశాల్లో పర్యటించారని..అందుకు మొత్తం రూ. 517 కోట్లు ఖర్చయిందని మంగళవారం రాజ్యసభలో  లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ . అమెరికా,రష్యాల,చైనాలకు ఐదు సార్లు వెళ్లినట్లు తెలిపారు.  తూర్పు లడఖ్‌లో భారత్ సుదీర్ఘమైన , తీవ్రమైన సరిహద్దు స్టాండ్-ఆఫ్‌లో ఐదుసార్లు వెళ్లారు. సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంకలకు కూడి వెళ్లినట్లు చెప్పారు. ఈ పర్యటనల్లో ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై చర్చించేందుకు వెళ్లినట్లు చెప్పారు.

బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా) సదస్సులో పాల్గొనడానికి మోడీ చివరిసారిగా బ్రెజిల్ 2019 నవంబర్ లో వెళ్ళారు. అదే నెలల థాయ్‌లాండ్‌ను కూడా సందర్శించాడు. కరోనావైరస్ మహమ్మారిపై ప్రపంచ లాక్డౌన్ కారణంగా 2020 లో ప్రధాని మోడీ సందర్శనలు చేయలేదు.

భారత్ లో కరోనా పంజా.. 90 వేలు దాటిన కరోనా మరణాలు