కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ హామీ..ప్రశంసల వర్షం కురిపించిన సీరం ఇండియా

కరోనా వ్యాక్సిన్ పై  ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ హామీ..ప్రశంసల వర్షం కురిపించిన సీరం ఇండియా

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యూఎన్ జీఏ) కరోనా వైరస్ పై ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనవల్లా ప్రశంసల వర్షం కురిపించారు.
యూఎన్జీఏలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో భారత్ 150కి పైగా దేశాలకు నిత్యవసర మందుల్ని పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఇక ప్రపంచదేశాల్లో కెల్లా అతిపెద్ద కరోనా వైరస్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే దేశం నుంచి ప్రపంచానికి భరోసా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేలా ప్రపంచానికి సాయం చేసేందుకు భారత్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తి సామర్ధ్యం సరిపోతుందంటూ ప్రపంచదేశాలకు హామీ ఇచ్చారు.

అయితే ఈ ప్రసంగానికి ముందురోజు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనవల్లా ఓ సందేహం వ్యక్తం చేశారు. . ఏడాదిలో భారత ప్రభుత్వానికి 80,000 కోట్లు ఖర్చు చేస్తుందా…? ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సిన అవసరం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇదో దేశానికో పెద్ద సవాలు అన్నారు.

ఈ ట్వీట్ చేసిన తరువాత ప్రదాని మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యూఎన్ జీఏ) చేసిన ప్రసంగంపై అదర్ పూనవల్లా స్పందించారు.

ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు మీరు చేస్తున్న కృషి ఎనలేనిది. మీ ఆలోచన దేశానికే గర్వకారణం, మీ నాయకత్వానికి మరియు మద్దతుకు ధన్యవాదాలు. మీ సారధ్యంలో దేశ ప్రజల అవసరాల్ని తీర్చేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైందంటూ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనవల్లా ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.