దిశ నిందితుల వివరాలు బయటకు రానివ్వని పోలీసులు

దిశ నిందితుల వివరాలు బయటకు రానివ్వని పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన దిశ హత్య కేసు మనందరికి తెలిసిందే. ఆ నిందితుల కస్టడీపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న పిటీషన్‌పై ఆర్డర్ కాపీ కాసేపట్లో పోలీసులకు అందనుంది. అయితే నిందితులను బహిరంగంగా ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్నాయి. దాంతో నిందితుల కస్టడీపై పోలీసులు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కేసుకు సంబంధించిన విషయాలలో అంత్యంత గోప్యత పాటిస్తున్నారు. నిందితులకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిందితుల సమాచారాన్ని ఎవరికీ తెలియనీయడం లేదు. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించినప్పటి నుంచి వారిని ఏ గదిలో ఉంచారు, వాళ్లు ఏం తింటున్నారు అనే విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అందుకే నిందితుల భద్రత దృష్ట్యా వారి గురించి ఎటువంటి విషయాలు బయటకు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దిశ కేసుకు సంబంధించి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దాంతో నిందితుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. నిందితులను కస్టడీకి ఇచ్చినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వారిని కోర్టుకు తీసుకువెళ్లలేని పరిస్థితి ఉంది. దిశకు న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో వారి భద్రతపై పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో చర్లపల్లి జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి ఇస్తే… కోర్టులోనే ఐడెంటిటీ పరేడ్ నిర్వహించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More News

బీటెక్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో మరో మలుపు
తల్లీ, బిడ్డలను పెట్రోల్ పోసి కాల్చేశారు