వాట్సప్లో చర్చించుకుని స్టేషన్ లో విధ్వంసం

వాట్సప్లో చర్చించుకుని స్టేషన్ లో విధ్వంసం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లకు వాట్సప్ గ్రూప్ వేదికగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన పలువురు ఆందోళనకారుల మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని తనిఖీ చేయగా జస్టిస్ ఫర్ ఆర్మీ సీఈఈ, హకీంపేట్ ఆర్మీ సోల్జర్ పేరుతో వాట్సప్ గ్రూపులను గుర్తించారు. ఆ గ్రూపుల నుంచే విధ్వంసం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పెట్రోల్ బాటిళ్లు, పాత దుస్తులు, టైర్లు తెచ్చుకోవాలన్న ఆడియో మెసేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గురువారం జరిగిన వాట్సప్ ఛాటింగ్ లో అల్లర్లకు ప్లాన్ చేసుకున్నారు. దాదాపు 300 మంది యువకులు శుక్రవారం ఉదయం 6 గంటలకు కృష్ణా ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుని విధ్వంసం సృష్టించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రైవేట్ డిఫెన్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆందోళనకారులు కోచింగ్ తీసుకుంటున్న అన్ని డిఫెన్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నిరసనకారులు బీహార్, హర్యానాలో జరిగిన అల్లర్లు చూసి ఇక్కడ వాట్సప్ గ్రూప్స్లో చర్చించుకుని స్టేషన్ లో విధ్వంసం సృష్టించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.