మా ఎన్నికల్లో గెలిచి సత్తా చూపిస్తా

V6 Velugu Posted on Oct 04, 2021

మా ఎన్నికల్లో తన సత్తాతోనే గెలుస్తానన్నారు ప్రముఖు నటుడు ప్రకాశ్ రాజ్. తనకు పెద్దల ఆశీర్వాదం వద్దని చెప్పారు. పెద్దోళ్లను ప్రశ్నించే సత్తా ఉన్న వారే మా అధ్యక్షుడిగా గెలవాలని ఆకాక్షించారు. తాను తెలుగు వాడు కాదన్న నరేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశ్ రాజ్. తనకు వచ్చినంత తెలుగు.. మంచు విష్ణు ప్యానెల్ లో ఎవ్వరికీ రాదని చెప్పారు. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తనకు తెలుసన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నరేశ్ ను హెచ్చరించారు. కోపం, బాధతో వేసే ఓటు సునామీలో మంచు విష్ణు కొట్టుకుపోవాలన్నారు ప్రకాశ్ రాజ్. 

Tagged COMMENTS, Naresh, Prakash Raj, , MAA election, Manchu Family

Latest Videos

Subscribe Now

More News