పెరిగిన బంగారం ధరలు: 10 గ్రాములు రూ.50 వేలు

పెరిగిన బంగారం ధరలు: 10 గ్రాములు రూ.50 వేలు

లాక్ డౌన్ తో పనుల్లేక  ప్ర‌జ‌ల చేతుల్లో డ‌బ్బులు లేవు. పెళ్లిళ్ల సీజ‌న్ ముగిసింది. దీంతో క‌స్ట‌మ‌ర్లు లేక బంగారు షాపులు వెల వెల బోతున్నాయి. అయినా  గోల్డ్ రేట్ ఏమాత్రం తగ్గకుండా …భారీగా పెరుగుతోంది. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్ లో ధరలు భారీగా పెరిగి స‌రికొత్త‌ రికార్డ్ క్రియేట్ చేసింది. వెండి కూడా అదే బాట పట్టింది.

బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,580కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.46,290 పలికింది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధర రూ.48,800కు చేరుకుంది. ఆర్థిక అభద్రత కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగిపోతున్నాయ‌ని మార్కెటింగ్ నిపుణులంటున్నారు. సురక్షితమైన పెట్టుబడి కోసం ప్రజలు బంగారం, వెండిపై పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నార‌ని, ఆర్థిక అభద్రత ఉండడంతో బంగారంపై పెట్టుబడులు పెడుతుండ‌టంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయంటున్నారు.