స్టూడెంట్ ను కొట్టిన ప్రిన్సిపాల్ అరెస్ట్

స్టూడెంట్ ను కొట్టిన ప్రిన్సిపాల్ అరెస్ట్

దిల్ సుఖ్ నగర్,వెలుగు: సరూర్ నగర్ లోని బీసీ గురుకుల రెసిడెన్షియల్ స్టూడెంట్ ను ప్రిన్సిపాల్ చితక బాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రెసిడెన్షియల్ ముందు బాలుడి బంధువులు ఆందోళన చేయడంతో సరూర్ నగర్ పోలీసులు ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేశారు. పోలీసులు,బాలుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..వరంగల్ జిల్లా కమలాపూర్మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన పి.దేవేందర్, జయశ్రీ దంపతులకు కుమారుడుపి.శ్రీవత్సవ్(11) ఉన్నాడు. సరూర్ నగర్ లోని పంజాల అనిల్ కుమార్ కాలనీలోని మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ బాలురగురుకుల రెసిడెన్షియల్ లో శ్రీవత్సవ్ 5వ తరగతిచదువుతున్నాడు.

ఈ నెల 4న ఉదయం 9 .15గంటల సమయంలో శ్రీవత్సవ్ వాటర్ కోసం బాటిల్ తీసుకుని హాస్టల్ లోని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం బయటకుఎందుకు వచ్చావంటూ శ్రీవత్సవ్ ను కొట్టాడు. వాటర్ కోసం వెళ్తున్నానని ఆ బాలుడు చెప్పినా వినిపించుకోకుండా ప్రిన్సి పాల్ అతడిని కింద పడేసి కొట్టాడు. ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం చేతి గోర్లు బలంగా గుచ్చుకోవడంతో శ్రీవత్సవ్ చెవులకు గాయమైంది. టీచర్ జ్యోతి బాలుడిని స్థానికంగా ఉన్న ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించారు. తర్వాత కొద్ది రోజులకే విద్యార్థి సంక్రాంతి సెలవులకు ఇంటికి పంపారు.ఇంటికి వచ్చిన శ్రీవత్సవ గాయాలను గుర్తించిన తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు.సోమవారం కుమారుడిని తీసుకుని తల్లి జయశ్రీ, కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చారు . ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యంను నిలదీశారు. వారితో కూడా సుబ్రహ్మణ్యం దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వారు రెసిడెన్షియల్ ఎదుట ఆందోళనచేశారు. అనంతరం సరూర్ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. సరూర్ నగర్ పోలీసులు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రవి వెల్లడించారు.

see more news కారులో పడుకుంటే కాలిపోయాడు