టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్ : ప్రచారంలో బిజీగా ప్రైవేట్ స్కూల్స్

టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్ : ప్రచారంలో బిజీగా ప్రైవేట్ స్కూల్స్

హైదరాబాద్, వెలుగు: సార్ నమస్తే బాగున్నారా.. మేం ఫలానా స్కూల్ నుంచి వచ్చాం…మీ ఇంట్లో స్కూలుకు వెళ్లే పిల్లలున్నారా..ఏ స్కూల్ లో చదువుతున్నరు సర్.. మా స్కూల్లో చేర్పించండి..అన్ని సౌకర్యాలు ఉన్నాయి.. ఇదిగో చూడండి ఫస్ట్ క్లాస్ నుంచే ఇంగ్లిష్ లో మాట్లాడిస్తున్నామంటూ మొబైల్ లో రికార్డ్ చేసిన వీడియోలు. ఇది చూడండి మా స్కూల్ విద్యార్థుల మార్క్స్ ఈ ఏరియాలో మా స్కూల్ నుండే ఎక్కువ టాపర్స్ ఉన్నారు.. ఇదీ ప్రయివేటు స్కూళ్ల ప్రచారం..తమ పాఠశాలలో డిజిటల్ క్లాసు లు, స్పోర్స్ట్ తో అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ డోర్ టు డోర్ తిరుగుతున్నారు. నగరంలో వేల కొద్ది వెలసిన ప్రైవేట్ స్కూల్స్ ఒకదాని వెనుక ఒకటి ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తూ విద్యార్థుల ఇండ్ల ముందు వాలిపోతున్నాయి. ప్రవేశాలకు సమయం దగ్గరపడుతుండడంతో స్కూల్లలో స్ట్రెంత్ పెంచేందుకు అడ్మిషన్ల కోసం ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యం ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. చేసేది లేక ఎండలు తీవ్రంగా మండుతున్న తమ యాజమాన్యం ఆదేశాలతో టీచర్స్ కాలనీలలో తిరుగుతూ మా స్కూల్ ల చేర్పించడి మేడం అంటూ..తిప్పలు పడుతున్నారు.

విధించిన టార్గెట్ ను పూర్తి చేస్తేనే టీచర్స్ కు ఇంక్రిమెంట్లు ఉంటాయి. మొత్తానికి చేయకపోతే జాబ్ ఉంటుందో ఊడుతుందో తెలియదు ఇలా కొన్ని స్కూల్స్ లో టార్గెట్ పెట్టగా మరి కొన్ని స్కూల్ లలో అడ్మిషన్ లో కమిషన్ ఇస్తూ టీచర్స్ ను సిటీలోని ప్రతీ కాలనీలోకి వెళ్లి ఇంటింటికీ తమ టీచర్స్ ను తిప్పుతూ విద్యార్థుల,తల్లిదండ్రుల వివరాలు సేకరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కాలనీలలో సేకరించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సర్ ఏమైంది స్కూల్ కు వస్తానన్నారు రాలేదు. అడ్మిషన్స్ కంప్లీట్ అవుతున్నాయి. వచ్చి ఫీజు మాట్లాడుకోండి అంటూ ఫోన్ కాల్స్..దీనితో పాటు విధ్యార్ధుల తల్లిదండ్రులతో ఫీజ్ డీల్ చేసేందుకు మంచి మాటకారులను పీఆర్ఓ లు చేర్చుకొని సెట్ చేస్తున్నారు. దీనితో ఆ స్కూల్స్ గురించి తెలిసిన తల్లిదండ్రులు వెనుకడుగు చేస్తున్నప్పటికి కొత్తగా ప్రైవేట్ కార్పొరేట్ స్థాయి స్కూల్స్ లో తమ పిల్లలను చేర్పిస్తున్న వారు చెప్పే మాటలతో స్కూల్ లలో చేర్పిస్తున్నారు.

కాలేజీలదీ ఇదే పరిస్థితి

ప్రైవేట్ స్కూల్ లనే కాదు..ప్రైవేట్ కళాశాలలది ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పది విద్యార్థుల రిజల్ట్స్ రానేలేదు..ప్రైవేట్ స్కూల్ ల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల కాంటాక్ట్ నంబర్స్ సేకరించి ఫోన్ లు చేస్తునారు. కొన్ని కళాశాలలు తమ కళాశాలలో సౌకర్యా లు ఇలా ఉన్నాయని, ర్యాంకులు ఇలా ఉన్నాయని బల్క్ మెసేజ్ లు పంపిస్తూ ఆకర్శించేందుకు ప్రయత్నిస్తునారు…ఇక టెన్త్ రిజల్ట్స్ విడుదలైన సమయం దగ్గర పడడంతో ప్రైవేట్ కళాశాలలు ప్రచారానికి పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. చట్ట ప్రకారం ఇలా ప్రచారాలు చేస్తే చర్యలు తప్పక తీసుకుంటా మని చెపుతున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయంపై హయత్ నగర్ ఎంఈఓ ను వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధా నం చెప్పారు.