ప్రభుత్వ కీలక శాఖల్లో ప్రైవేట్ ఉద్యోగులు

ప్రభుత్వ కీలక శాఖల్లో ప్రైవేట్ ఉద్యోగులు

వివిధ శాఖల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారుల స్థానంలో ప్రైవేట్‌ ఉద్యోగులను తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రైవేట్‌ రంగానికి చెందిన కనీసం 30 మందిని ప్రభుత్వ శాఖల్లో జాయింట్‌ సెక్రటరీలు, డైరెక్టర్లుగా నియమించనుంది. సాధారణంగా ఈ పోస్టుల్లో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ద్వారా ఎంపికైన ప్రభుత్వం అధికారులను నియమిస్తారు. అయితే ఈ పద్ధతిని కాదని, తమకు నచ్చిన ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగులను కీలక స్థానాల్లో నియమించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో 10 మందిని ఇలాగే తీసుకున్నారు. ఈసారి ఏకంగా 30 మందిని తీసుకోనున్నారు. వాణిజ్యం, పరిశ్రమలు, రెవెన్యూ, ఫైనాన్స్‌, అగ్రికల్చర్‌, న్యాయం, ఆర్థిక వ్యవహారాల శాఖలో వీరిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు.