జీతాలు లేక ఇబ్బందిప‌డుతున్నం.. కాస్త ప‌ట్టించుకోండి

జీతాలు లేక ఇబ్బందిప‌డుతున్నం.. కాస్త ప‌ట్టించుకోండి

ప్ర‌భుత్వం ఆదుకోవాలంటూ ప్రైవేట్ టీచ‌ర్ల డిమాండ్

హైద‌రాబాద్: సమస్యల పరిష్కారం కోరుతూ ప్రైవేటు టీచర్లు ఇందిరాపార్క్ దగ్గర ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రైవేటు టీచర్ల ఫోరమ్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. వివిధ జిల్లాలనుంచి పెద్దసంఖ్యలో టీచర్లు ధర్నాలో పాల్గొన్నారు. కరోనా టైంలో ఉద్యోగాలు పోయాయని.. జీతాలు లేక ఇబ్బందిపడుతున్నామని ప్రైవేటు ఉపాధ్యాయులు అంటున్నారు. వీరికి పలు పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. కరోనా టైంలో జీతాలు లేక టీచర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారన్నారు నేతలు. ఇప్పటికే 20 ప్రైవేటు టీచర్లు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎంతోమంది పిల్లల జీవితాలు నిలబెట్టిన ప్రైవేటు టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.