Dil Raju: డ్రీం ప్రాజెక్ట్ ప్రకటించిన దిల్ రాజు.. హీరో అతనేనా?

Dil Raju: డ్రీం ప్రాజెక్ట్ ప్రకటించిన దిల్ రాజు.. హీరో అతనేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిరుచి గల నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు(Dil Raju). కెరీర్ మొదట్లో సెలక్టీవ్ గా, కథా బలమున్న సినిమాలు చేసి స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్టులోకి చేరిపోయాడు. ఆయన సంస్థ నుండి ఒక సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే స్థాయికి చేరుకున్నారు. తెలుగులో దిల్ సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం రిలీజ్ సిద్ధంగా ఉన్న ది ఫ్యామిలీ స్టార్ వరకు విజయాలతో సాగింది. 

తాజాగా దిల్ రాజు ఆయన సంస్థ నుండి వస్తున్న ది ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఆయన చేయబోయే డ్రీం ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చాడు. నిర్మాతగా నా ప్రయాణం మొదలై 21 ఏళ్ళు అవుతోంది. ఈ సందర్బంగా వచ్చే నాలుగేళ్లలో ఒక భారీ సినిమా చేయాలని అనుకుంటున్నాను. అదే నా డ్రీం ప్రాజెక్టు. దానిపై వర్క్ కూడా స్టార్ట్ చేశాం. త్వరలోనే దానిపై ప్రకటన ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దీంతో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

ALSO READ | Vijay Devarakonda: కొత్తవారితో రిస్క్ చేయను.. అందుకే నో ఛాన్స్.. విజయ్ షాకింగ్ కామెంట్స్

మరోపక్క ఆయన చేయబోయే డ్రీం ప్రాజెక్టు ఇదే అంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదేంటంటే.. దిల్ రాజు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తారని, ఆ ప్రాజెక్టు కి రావణం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. దీంతో దిల్ రాజు చెప్తున్న డ్రీం ప్రాజెక్టు అదే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.