బీసీ బంధు కోసం  8న కలెక్టరేట్ల ముట్టడి

బీసీ బంధు కోసం  8న కలెక్టరేట్ల ముట్టడి

హైదరాబాద్, వెలుగు: బీసీ బంధుతో పాటు బీసీ హక్కుల సాధన కోసం ఈ నెల 8న రాష్ట్రంలో ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య తెలిపారు. బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి, కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అలాగే పెండింగ్‌‌‌‌‌‌‌‌లో​ఉన్న ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బకాయిలు చెల్లించాలన్నారు. రాష్ట్రంలో 5.77 లక్షల మందికి బీసీ సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నారు. 12 బీసీ కుల ఫెడరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌కు రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు.