నడాల్‌ను ఆపతరమా!

నడాల్‌ను ఆపతరమా!
  • నేడు కాస్పర్‌ రుడ్‌తో ఫైనల్‌ సా. 6.30 నుంచి సోనీలో

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆడిన 35 మ్యాచ్‌ల్లోనూ స్వైటెక్‌ గెలిచింది. దాంతో, ఓపెన్‌ ఎరాలో వరుసగా ఎక్కువగా మ్యాచ్‌లో గెలిచిన వీనస్‌ విలియమ్స్‌ సరసన నిలిచింది. జస్టిన్‌ హెనిన్‌ (2007/08) తర్వాత ఒక ఏడాది వరుసగా ఆరు టైటిళ్లు గెలిచిన తొలి మహిళ ఇగా..ఓపెన్‌ ఎరాలో   ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒకటి కంటే ఎక్కువ టైటిల్స్‌ నెగ్గిన పదో మహిళా ప్లేయర్​గా ఇగా స్వైటెక్‌ నిలిచింది. 

పారిస్‌‌‌‌:మట్టి కోటలో ఎదురులేని..ఫైనల్‌‌ వచ్చిన ప్రతీసారి ట్రోఫీ నెగ్గిన స్పెయిన్‌‌ లెజెండ్‌‌ రఫెల్‌‌ నడాల్‌‌ ఒకవైపు..! ఓ గ్రాండ్‌‌స్లామ్‌‌ టోర్నీలో తొలిసారి ఫైనల్‌‌ చేరి ఈ ఘనత సాధించిన తొలి నార్వే ప్లేయర్‌‌గా రికార్డు సృష్టించిన కాస్పర్‌‌ రుడ్‌‌ ఇంకోవైపు..! అంచనాలను అందుకుంటూ ఆఖరాటలో హాట్‌‌ ఫేవరెట్‌‌ ఒకరైతే.. అనూహ్యంగా ముందుకొచ్చింది ఇంకొకరు..! . ఆదివారం ఇక్కడి ఫిలిప్‌‌ చార్టర్‌‌ మెయిన్‌‌ స్టేడియంలో జరిగే ఫ్రెంచ్​ ఓపెన్​ మెన్స్‌‌ సింగిల్స్‌‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోబోతున్నారు.  రికార్డు స్థాయిలో ఇప్పటికే 21 గ్రాండ్‌‌స్లామ్స్‌‌ నెగ్గిన నడాల్‌‌... తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ను 14వ సారి హస్తగతం చేసుకోవడంపాటు  22 మేజర్‌‌ టైటిల్స్‌‌తో  మెన్స్‌‌ సింగిల్స్‌‌లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. అదే టైమ్‌‌లో ఎనిమిదో సీడ్‌‌ కాస్పర్‌‌ ఫైనల్‌‌ చేరిన తొలిసారే గమ్యాన్ని ముద్దాడాలని ఆశిస్తున్నాడు. 23 ఏళ్ల ఈ నార్వే ప్లేయర్‌‌ ఇప్పటిదాకా ఓ గ్రాండ్‌‌స్లామ్‌‌ టోర్నీలో నాలుగో రౌండ్‌‌ దాటింది లేదు. కానీ, ఈసారి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న అతను శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన రెండో సెమీస్‌‌లో కాస్పర్‌‌ రుడ్‌‌ 3–-6, 6–-4, 6–-2, 6–-2తో  2014 యూఎస్‌‌ ఓపెన్‌‌ చాంపియన్‌‌ మారిన్‌‌ సిలిచ్‌‌ (క్రొయేషియా)పై గెలిచి నడాల్‌‌తో టైటిల్‌‌ ఫైట్‌‌కు రెడీ అయ్యాడు. తొలి సెమీస్‌‌ మధ్యలో జ్వెరెవ్‌‌ గాయపడటంతో వాకోవర్‌‌ విజయంతో నడాల్‌‌ ముందంజ వేసిన సంగతి తెలిసిందే. ఈ కోర్టుపై గత రికార్డు, ప్రస్తుత ఫామ్‌‌, ర్యాంక్‌‌, అనుభవం ఇలా ఏ రకంగా చూసుకున్న ఫైనల్లో నడాల్‌‌ ఫేవరెట్‌‌గా కనిపిస్తున్నాడు. మరి, మొదటిసారి రఫాతో తలపడుతున్న రుడ్‌‌ అతడిని అడ్డుకొని సంచలనం సృష్టిస్తాడో లేదో చూడాలి.