Rakul Preet Singh: కారు పక్కన పెట్టి..ఆటోలో రకుల్ చక్కర్లు

Rakul Preet Singh: కారు పక్కన పెట్టి..ఆటోలో రకుల్ చక్కర్లు

ర‌కుల్ ప్రీతి సింగ్ (Rakul Preet Singh) నటుడు, నిర్మాత జాకీ భ‌గ్నానీ (Jackky Bhagnani) ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 22న పెళ్లి పీటలెక్కనున్నారు. కుటుంబ సభ్యులు, స‌న్నిహితులు, స్నేహితుల స‌మంక్షంలోనే వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. 

ఇదిలా ఉండగా..ప్రస్తుతం రకుల్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. పెళ్ళి డేట్ దగ్గర పడుతుండటంతో..షాపింగ్స్ చేసే పనిలో ఉంది. పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలంటే బయటే ఎక్కువగా తిరగాల్సి వస్తుంది.అందులో షాపింగ్స్ కోసం చాలా చోట్లకి వెళ్లాల్సి వస్తుందట. ఇక కారులో అటు ఇటూ తిరగడం కూడా ఇబ్బందిగా ఉండటంతో..పక్కనే ఉన్న ఆటోలో ప్రయాణం చేసింది. ఈ ఆటోలో రకుల్ పొట్టి గౌనులో కూర్చొని..ఫ్యాన్స్ కెమెరాస్ కి ఫోజులిచ్చింది. ప్రస్తుతం రకుల్ షాపింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ కి కార్లకు ఎలాంటి లోటు ఉండదు.కానీ, కాస్తా రిలాక్స్ అవ్వడం కోసం ఆటోలో వెళ్లినట్లు తెలుస్తోంది. 

అయితే మొదట వీదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్కి ర‌కుల్ ప్రీత్ సింగ్ -జాకీ  రెడీ అయ్యారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పిలుపుతో వెడ్డింగ్ వేదికను గోవాకి మార్చుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం రకుల్ కి కాబోయే భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. 

ALSO READ :- OnePlus 12R: హెడ్ టర్నర్ స్మార్ట్ఫోన్.. ట్రిపుల్ కెమెరా సెటప్ దీని ప్రత్యేకత