OnePlus 12R: హెడ్ టర్నర్ స్మార్ట్ఫోన్.. ట్రిపుల్ కెమెరా సెటప్ దీని ప్రత్యేకత

OnePlus 12R: హెడ్ టర్నర్ స్మార్ట్ఫోన్.. ట్రిపుల్ కెమెరా సెటప్ దీని ప్రత్యేకత

OnePlus 12R: ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్న OnePlus 12 సిరీస్ ను లాంచ్ చేశారు. సిరీస్ లోని రెండు మోడళ్లలో మంచి ఫీచర్లతో OnePlus 12R ని ఆకట్టు కుంటోంది. 6.78 అంగుళాల AMOLED డిస్ ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్ తో వీడియోలు చూస్తున్నా..గేమ్ లు ఆడుతున్నా డిస్ ప్లేతో మంచి అనుభవాన్ని అంది స్తోంది. OnePlus 12R సొగసైన ప్రీమియం డిజైన్ ను అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ఫోన్ మన్నిక, లగ్జరీ రెండింటిని జోడిస్తుంది. వెనక ప్యానెల్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణతో హెడ్ టర్నర్గా మారుతుంది. 

కెమరా

ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్8Gen2 ప్రాసెసర్, 16GB RAM ద్వారా రన్ అవుతుంది. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, వీడియోలను స్ట్రీమింగ్ చేయడం, గేమ్ లు ఆడటం వంటివాటికి ఎలాంటి అంతరాయం లేకుండా పనితీరును అందిస్తుంది. 

OnePlus 12R లో కెమెరా సెటప్ ప్రత్యేకమైనది. ట్రిపుల్ లెన్స్ కెమెరా సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ ఉంటుంది. మెయిన్ కెమెరా సెన్సార్ ద్వారా అద్భుతమైన ఫొటోలను తీయొచ్చు. సెల్ఫీ కోసం ఫ్రంట్ కెమెరా ఖచ్చితమైన స్కిన్ టోన్ తో ఫొటోలను అందిస్తుంది. 

బ్యాటరీ

5500 mAh బ్యాటరీతో OnePlus 12 R రోజంతా వాడినా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోదు.ఛార్జింగ్ కోసం 100 Wat ఛార్జర్ లభిస్తుంది. ఎటువంటి అంతరాయం లేకుండా మీ పనులు చేసుకోవచ్చు. 

ALSO READ :- కలుషిత ఆహారం తిని ఇద్దరు వలస కార్మికులు మృతి

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి OnePlus 12R ఓ మంచి ఎంపిక. దాని సొగసైన డిజైన్ , ఎనర్జిటిక్ ప్రాసెసర్, అధిక బ్యాటరీ లైఫ్ ఇందులో ప్రత్యేకతలు. గేమ్ అయినా, మల్టీమీడియా  వినియోగించేవారికైనా నమ్మదగిన స్మార్ట్ ఫోన్ అంటే OnePlus. \

OnePlus12R రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. కూల్ బ్లూ, ఐరన్ గ్రే కలర్లతో రెండు వేరియంట్లను అందిస్తుంది.8GB+128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 39,999 కాగా, 16GB+256GB వేరియంట్ ధర రూ.45,999.