కలుషిత ఆహారం తిని ఇద్దరు వలస కార్మికులు మృతి

 కలుషిత ఆహారం తిని ఇద్దరు వలస కార్మికులు మృతి

కలుషిత ఆహారం తిని 20 మంది ఒరిస్సా కార్మికులు అస్వస్థత గురయ్యారు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లా  గౌ రెడ్డి పేటలో చోటుచేసుకుంది.  వీరంతా ఇటికబట్టిలో పనిచేస్తున్నారు.  అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 14 మంది కార్మికులకు సీరియస్ ఉండడంతో గుడ్ లైఫ్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.   అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.  ఇటుకబట్టిలో పనిచేస్తున్న లక్ష్మణ్ సూపర్ వైజర్ ని వివరణ అడగగా చికెన్ లోని పేగులు, కోడి కాళ్లు చికెన్ తినడంతో వీరంతా అస్వస్థకు గురైనట్లుగా తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ALSO READ :- ఎకసెకలు వద్దు : లేఆఫ్స్ పై పోస్టు పెట్టాడు.. ఉన్న ఐటీ ఉద్యోగం పీకేశారు