రామమందిర నిర్మాణం ప్రతి హిందువు కల.. రాజకీయం చేయొద్దు

రామమందిర నిర్మాణం ప్రతి హిందువు కల.. రాజకీయం చేయొద్దు

అయోధ్య రామ మందిర నిర్మాణంలో దేశంలోని హిందువులంతా భాగస్వామ్యం అవ్వాలని సంకల్పంతో వెళ్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు… నకిలీ చందా బుక్కులతో డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఆరోపించడం సబబు కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు కల అని, 500 సంవత్సరాల తర్వాత మందిర నిర్మాణం చేయాలని ట్రస్ట్ ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఆధీనంలో మందిర నిర్మాణం చేపట్టాలని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిందని రాజాసింగ్ గుర్తు చేశారు. ఈ మందిర నిర్మాణ కార్యక్రమం బీజేపీ పార్టీది కాదని, రామ భక్తులదని చెప్పారు.

రామ భక్తులు ఇంటింటికి తిరిగి డబ్బులు స్వీకరించి అకౌంట్ లో వేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని రాజా సింగ్ హిత‌వు ప‌లికారు. ప్రజలనుండి వచ్చిన డబ్బుల లెక్కలన్నీ ట్రస్ట్ వద్దనే ఉంటాయి కాబ‌ట్టి అక్కడికి వెళ్తే ఆ వివ‌రాల‌న్ని అధికారులు చూపిస్తారన్నారు. ఒక‌వేళ కాదంటే ఫిబ్రవరి 10 తర్వాత గ్రౌండ్ సిద్ధం చెయ్యండి అప్పుడు చూసుకుందామ‌ని ఆయ‌న అన్నారు.

టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొట్టినా కూడా గాంధీ మార్గం లో వెళ్ళాలి వాళ్ళకి కౌంటర్ ఇవ్వొద్దని పార్టీ కార్య‌క‌ర్త‌లకు సూచించారు రాజాసింగ్.