కాగజ్‌నగర్‌ అడవిలో అరుదైన పక్షులు

కాగజ్‌నగర్‌ అడవిలో అరుదైన పక్షులు

గతంలో ఎప్పుడూ అగుపించని అరుదైన పక్షులు కొద్ది రోజులుగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవిలో కనిపిస్తున్నాయి. బ్రౌన్ హెడెడ్ బార్బెట్, వెర్డిటార్ ఫ్లై క్యాచర్, అల్ట్రా మెరైన్  ఫ్లై క్యాచర్, సాండ్ పైపర్ బర్డ్
వీటిలో ఉన్నాయి. ఈ పక్షులను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రాజేష్ కన్నీ తన కెమెరాలో బంధించారు. ఈ పక్షులు హిమాలయాల్లో, దట్టమైన అడవులు, నదీ తీరాల్లో కేవలం క్రిములు, కీటకాలు తిని జీవిస్తుంటాయని రాజేష్ తెలిపారు. కరోనా లాక్ డౌన్ తర్వాత వాతావరణంలో భారీ మర్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హిమాలయాలు, కాకులు దూరని కారడవుల్లాంటి దట్టమైన అడవుల్లో ఉండే వాతావరణం మన కాగజ్ నగర్ అడవిలోనూ కనిపించడం వల్లే ఈ పక్షులు ఇలా వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేయడంతో మళ్లీ మన పాత అలవాట్లతో వాతావరణాన్ని కలుషితం చేస్తే ఇవి తిరిగెళ్లిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అవి ఇక్కడ తిరుగుతున్నంత కాలం మన వాతావరణం బాగున్నట్లే.