ఇండియా చేతుల్లోకి సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌, సిరీస్‌‌‌‌

ఇండియా చేతుల్లోకి సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌, సిరీస్‌‌‌‌

ముంబై: వరుసగా మూడో రోజు కంప్లీట్‌‌‌‌ డామినేషన్‌‌‌‌ చూపెట్టిన టీమిండియా.. న్యూజిలాండ్‌‌‌‌తో  సెకండ్‌‌‌‌ టెస్టులో భారీ విక్టరీకి చేరువైంది. మిడిలార్డర్‌‌‌‌ మరోసారి ఫెయిలైనప్పటికీ.. రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ (3/27) స్పిన్‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌తో సిరీస్‌‌‌‌ సొంతం చేసుకునేందుకు ఇంకో ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. ఇండియా ఇచ్చిన 540 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో మూడో రోజు, ఆదివారం చివరకు కివీస్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 140/5తో ఓటమి ముంగిట నిలిచింది. దాదాపు అసాధ్యమైన ఛేజింగ్‌‌‌‌లో డారిల్‌‌‌‌ మిచెల్ (60), హెన్రీ నికోల్స్‌‌‌‌ (36 బ్యాటింగ్‌‌‌‌) కాస్త పోరాడినా.. అశ్విన్‌‌‌‌ వెంటవెంటనే 3 వికెట్లు పడగొట్టడంతో కివీస్‌‌‌‌ డీలా పడ్డది.  ప్రస్తుతం నికోల్స్‌‌‌‌తో పాటు రచిన్‌‌‌‌ (2 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. ఇంకో రెండు రోజుల ఆట మిగిలుండగా.. చేతిలో 5 వికెట్లు ఉన్న కివీస్‌‌‌‌కు ఇంకో 400 రన్స్‌‌‌‌ అవసరం. ఇండియా జోరు చూస్తే సోమవారం ఫస్ట్‌‌‌‌ సెషన్‌‌‌‌లోనే మ్యాచ్‌‌‌‌ ఫినిష్‌‌‌‌ అవ్వొచ్చు. అంతకుముందు ఇండియా సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను 276/7 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌ చేసి కివీస్‌‌‌‌కు పెద్ద టార్గెట్‌‌‌‌ ఇచ్చింది.  మయాంక్‌‌‌‌ (62) ఫిఫ్టీ కొట్టగా, పుజారా  (47), గిల్‌‌‌‌(47),  అక్షర్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 నాటౌట్‌‌‌‌) రాణించారు. అజాజ్‌‌‌‌ పటేల్‌‌‌‌ (4/106) సెకండ్​ ఇన్నింగ్స్​లో నలుగురిని ఔట్​ చేశాడు. రచిన్‌‌‌‌ రవీంద్ర (3/56) మూడు వికెట్లు పడగొట్టాడు.
మయాంక్‌‌‌‌ జోరు.. అజాజ్‌‌‌‌కు ఇంకో నాలుగు
సెకండ్‌‌‌‌ డేనే మ్యాచ్‌‌‌‌ను తన కంట్రోల్‌‌‌‌లోకి తెచ్చుకున్న కోహ్లీసేన సండే కూడా అదే జోరు చూపెట్టింది. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరు 69/0తో ఇండియా ఆట కొనసాగించింది. ఫస్ట్‌‌‌‌ ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన పుజారాచాలా కాన్ఫిడెన్స్‌‌‌‌తో కనిపించాడు. మరోవైపు ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ సెంచరీ ఫామ్‌‌‌‌ను కంటిన్యూ చేసిన మయాంక్‌‌‌‌ కూడా తన మార్కు షాట్లతో బౌండ్రీలు కొట్టాడు. అజాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో 90 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేసుకున్నాడు.  అయితే, ఫ్లయిటెడ్‌‌‌‌ బాల్‌‌‌‌తో  అగర్వాల్‌‌‌‌ను బోల్తా కొట్టించిన అజాజ్‌‌‌‌.. ఫిఫ్టీకి దగ్గరైన పుజారాను కూడా ఔట్‌‌‌‌ చేశాడు. పుజారా, మయాంక్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 107 రన్స్‌‌‌‌ జోడించారు. ఇక, వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన గిల్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ కోహ్లీ  (36) సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 82 రన్స్‌‌‌‌ యాడ్‌‌‌‌ చేశారు. అయితే, గిల్‌‌‌‌ చాలా ఈజీగా బ్యాటింగ్‌‌‌‌ చేసినప్పటికీ.. కోహ్లీ తన మార్కు చూపెట్టలేకపోయాడు. ఇద్దరూ రచిన్‌‌‌‌కు వికెట్లు ఇవ్వగా.. వచ్చుడుతోనే రెండు సిక్సర్లు కొట్టిన శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (14)... అజాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో స్టంపౌటయ్యాడు. కీపర్‌‌‌‌ సాహా(13)  కూడా ఫెయిలయ్యాడు. కానీ, చివర్లో ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ అక్షర్‌‌‌‌ టీ20 స్టయిల్లో ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. టీకి ముందు జయంత్‌‌‌‌ (6) ఔటైన వెంటనే కోహ్లీ ఇన్నింగ్స్‌‌‌‌ డిక్లేర్‌‌‌‌ చేశాడు.
షార్ట్‌‌‌‌ స్కోర్స్‌‌‌‌
ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌:  325; న్యూజిలాండ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: 62; ఇండియా సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: 276/7 డిక్లేర్డ్‌‌‌‌ (మయాంక్‌‌‌‌ 62, అజాజ్‌‌‌‌ 4/106); 
న్యూజిలాండ్‌‌‌‌  సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ (టార్గెట్‌‌‌‌ 540): 
45 ఓవర్లలో 140/5 (మిచెల్‌‌‌‌ 60, నికోల్స్‌‌‌‌ 36*, రచిన్‌‌‌‌ 2* , అశ్విన్‌‌‌‌ 3/27).

అశ్విన్‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌
భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో  కివీస్‌‌‌‌ను అశ్విన్‌‌‌‌ దెబ్బమీద దెబ్బ కొట్టాడు. స్పిన్‌‌‌‌ ఫ్రెండ్లీ పిచ్‌‌‌‌పై మూడు ఇంపార్టెంట్‌‌‌‌ వికెట్లు పడగొట్టాడు.  నాలుగో ఓవర్లోనే స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌, ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్‌‌‌‌ టామ్‌‌‌‌ లాథమ్‌‌‌‌ (6)ను ఎల్బీ చేసి ఇండియా విక్టరీకి పునాది వేశాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ అటాక్‌‌‌‌ చేసినా జోరు కొనసాగించిన అశ్విన్‌‌‌‌ వరుస ఓవర్లలో విల్‌‌‌‌ యంగ్‌‌‌‌ (20), సీనియర్‌‌‌‌ ప్లేయర్ రాస్‌‌‌‌ టేలర్‌‌‌‌ (6)ను వెనక్కిపంపి కివీస్‌‌‌‌కు మాస్టర్ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. ఈ టైమ్​లో  నికోల్స్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌తో మిచెల్​ 76 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేశాడు. అయితే, చివర్లో కమ్‌‌‌‌బ్యాక్‌‌‌‌ చేసిన అక్షర్‌‌‌‌.. వైడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌స్టంప్‌‌‌‌ బాల్‌‌‌‌తో మిచెల్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి ఫోర్త్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 73 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేశాడు. అక్షర్‌‌‌‌ తర్వాతి ఓవర్లోనే టామ్‌‌‌‌ బ్లండెల్‌‌‌‌ (0) రనౌటవగా,  రచిన్‌‌‌‌తో కలిసి నికోల్స్‌‌‌‌ ఆటను ఫోర్త్‌‌‌‌ డేకు తీసుకెళ్లాడు. 


14/225
ఈ మ్యాచ్‌లో అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌ పెర్ఫామెన్స్‌. ఇండియాపై ఓ టెస్టులో బెస్ట్‌ బౌలింగ్‌ అతనిదే. 1980లో ముంబైలోనే
13 వికెట్లు తీసిన ఇంగ్లండ్‌ బౌలర్‌ ఇయాన్‌ బోథమ్‌ (13/106) రికార్డు బ్రేక్‌ చేశాడు.

ఏమైంది.. గిట్లెందుకు ఆగినవ్‌‌
టీ బ్రేక్‌‌కు ముందు గ్రౌండ్‌‌లో ఇంట్రస్టింగ్‌‌ సీన్‌‌ కనిపించింది. అశ్విన్‌‌ బౌలింగ్‌‌లో లాథమ్‌‌ ఔటైన తర్వాత కిందికొచ్చిన స్పైడర్‌‌ కెమెరా షార్ట్‌‌ మిడ్‌‌ వికెట్‌‌ ఏరియాలో ఆగిపోయింది. దాంతో, ఇండియా ప్లేయర్లంతా కెమెరా ముందుకొచ్చి కాసేపు ఫన్‌‌ క్రియేట్‌‌ చేశారు.  కెప్టెన్‌‌ కోహ్లీ లెన్స్‌‌ను చూస్తూ ‘ఏమైంది.. ఎందుకు ఆగినవ్‌‌’ అన్నట్టు రియాక్ట్‌‌ అవగా... అశ్విన్‌‌ కెమెరాను పైకి పుష్‌‌ చేసే ప్రయత్నం చేశాడు. స్పైడర్‌‌ క్యామ్‌‌ స్ట్రక్‌‌ అయినట్టు తేలడంతో అంపైర్లు ముందుగానే టీ బ్రేక్‌‌ ఇచ్చారు.