ఢిల్లీలో కాలుష్యం తగ్గింది

ఢిల్లీలో కాలుష్యం తగ్గింది

పట్టపగలే అయినా వెలుతురు ఉండదు. కొన్ని మీటర్ల దూరంలో రోడ్డుపై వచ్చే వాహనాలూ కనిపించవు. అంతా పొగమంచు వ్యాపించి చీకటి పడినట్లుగా కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో కామన్ గా కనిపించే పరిస్థితి ఇది. పొగమంచు, దుమ్ము ధూళితో పాటు విపరీతమైన కంపు కొట్టే గాలితో అక్కడి జనాలు తరచూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే, గత మూడేండ్లలో పరిస్థితి కొంచెం మెరుగుపడిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరా న్ మెంట్ (సీఎస్ఈ) అనే సంస్థ వెల్లడించింది. ఢిల్లీలో గాలి కాలుష్యం మూడేండ్లలో 25% తగ్గిందని తన నివేదికలో పేర్కొంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) పార్లమెంటుకు సమర్పించిన డేటాను సీఎస్ఈ స్టడీ చేసి ఆ వివరాలతో నివేదికను విడుదల చేసింది .

మూడేండ్లలో 25 శాతం తగ్గింది

సాధారణంగా గాలిలో ఉండే ధూళి కణాల సైజు, లెవెల్స్‌‌ను (పీఎం) బట్టి కాలుష్యాన్ని అంచనా వేస్తారు. ఢిల్లీలో 2011–-2014తో పోలిస్తే, 2016– -2018లో పీఎం 2.5 లెవెల్స్ 25% వరకూ తగ్గినట్లు సీఎస్‌‌ఈ వెల్లడించింది. పొగమంచు ఏర్పడిన రోజులు కూడా చాలావరకూ తగ్గినట్లు తెలిపింది . చలికాలంలో పీఎం 2.5 లెవెల్స్ ఎక్కువగా నమోదైన రోజులు కూడా తగ్గినట్లు తేలింది. వరుసగా మూడు రోజుల పాటు పొగమంచు కమ్మేసిన సందర్భాలు కూడా తగ్గినట్లు గుర్తించారు. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న అనేక కఠిన చర్యల వల్లనే కాలుష్యం తగ్గిందని సీఎస్ఈ అభిప్రాయపడింది. ఫ్యాక్టరీల నుంచి కాలుష్యం ఎక్కువగా విడుదలవకుండా చూడటం, ఢిల్లీలో బొగ్గుతో కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను మూసివేయడం, ఇటుక బట్టీల ఓనర్లపై చర్యలు తీసుకోవడం, నిర్మాణాలు జరుగుతున్న చోట నుంచి దుమ్ము రేగకుండా చూడటం, కాలుష్యకారక వాహనాలను నియంత్రించడం వంటి అనేక చర్యల వల్లే పరిస్థితి కొంచెం మారిందని ఈ నివేదిక పేర్కొంది.

అయితే, గాలిలోని చెడు వాసన మాత్రం తగ్గలేదని సీఎస్ఈ ఎగ్జిక్యూటి వ్ డైరెక్టర్ అనుమితా రాయ్​చౌధరీ వెల్లడిం చారు. అలాగే, పీఎం 2.5 లెవెల్స్ ను కనీసం 65% వరకూ తగ్గిస్ తేనే ఆ సిటీలను క్లీన్ ఎయిర్ సిటీలుగా పరిగణిస్తారని ఆయన తెలిపారు. ఢిల్లీ క్లీన్ ఎయిర్ సిటీగా మారాలంటే ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవని అన్నారు.