రిలయన్స్ కరోనా టీకా..ఫేజ్-1 ట్రయల్స్ కు DCGIఓకే

రిలయన్స్ కరోనా టీకా..ఫేజ్-1 ట్రయల్స్ కు DCGIఓకే

న్యూఢిల్లీ: ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ముకేశ్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ లైఫ్​సైన్సెస్’ సంస్థ తయారు చేసిన కరోనా టీకా ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ కు శుక్రవారం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్​ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలిపింది. రిలయన్స్ సంస్థ రీకాంబినెంట్ ప్రొటీన్ సబ్ యూనిట్ పద్ధతిలో ఈ టీకాను తయారు చేస్తోంది. మహారాష్ట్రలోని 8 ప్రాంతాల్లో ఈ టీకాకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ టీకా వేసుకున్న వాళ్లకు సేఫ్టీ, ఇమ్యూనోజెనిసిటీ ఎంత మేరకు ఉన్నాయన్నది ఫేజ్ 1 ట్రయల్స్ లో పరీక్షించనున్నారు. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ సిఫారసుల మేరకు.. టీకా వేసుకున్న 42వ రోజున కరోనాకు వ్యతిరేకంగా యాంటీబాడీల ఉత్పత్తి ఎంత మేరకు జరిగిందన్న వివరాలను రిలయన్స్ కంపెనీ సమర్పించాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటివరకు దేశంలో ఆరు కరోనా టీకాల ఎమర్జెన్సీ వాడకానికి డీసీజీఐ అనుమతించింది.