వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోడీ ఫొటోను తొలగించండి

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోడీ ఫొటోను తొలగించండి

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫొటోను తొలగించాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖను ఆదేశించింది ఎన్నికల కమిషన్. మరికొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ఉన్న ప్రధాని మోడీ ఫొటోపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ... ప్రధాని ఫొటోను తొలగించాలని నిర్ణయించింది.

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోడీ ఫొటోను ఫ్రింట్ చేసి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు చేసింది. దీంతో ప్రధాని  ఫొటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్యశాఖను సీఈసీ ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో మోడీ ఫొటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఫొటోలను తొలగించాలని సీఎస్ లు, ఆరోగ్య కార్యదర్శులకు ఆదేశాలను జారీ చేసింది.