కాళేశ్వరం టెండర్ల టైమ్ పొడిగించాలే

కాళేశ్వరం టెండర్ల టైమ్ పొడిగించాలే

కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీ టెండర్లపై  కరోనా ఎఫెక్ట్‌‌పడింది. లాక్‌‌డౌన్‌‌ నేపథ్యంలో ఈ – ప్రొ క్యూర్‌‌మెంట్‌‌ బిడ్లు దాఖలు చేసే గడువు పొడిగిం చాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం బిడ్లు దాఖలు చేయడానికి తమకున్న ఇబ్బందులను ఇంజనీర్లకు  వివరించారు. వాటిని పరిగణలోకి తీసుకొని టెండర్లదాఖలు గడువు పెంచాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌‌-1లో ఎల్లంపల్లి నుంచి మిడ్‌‌మానేరుకు మూడో టీఎంసీ, లింక్‌‌-4లో మిడ్‌‌మానేరు నుంచి మల్ల న్నసాగర్‌‌వరకు రెండో టీఎంసీ పనులు చేపట్టేందుకు  ఇంజనీర్లు మార్చి 27, 30 తేదీల్లో వేర్వేరుగా ఈ ప్రొక్యూర్‌‌మెంట్‌‌ టెండర్లు జారీ చేశారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌‌మానేరు వరకు నాలుగు ప్యాకే జీలుగా చేపట్టే పనులకు రూ.11,710.70 కోట్లతో, మిడ్‌‌మానేరు నుంచి మల్ల న్నసాగర్‌‌ వరకు చేపట్టే పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.9,747.30 కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. మిడ్‌‌మానేరు నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టేపనులకు ఈ నెల 17న సాయంత్రం 5 గంటల వరకు, మిడ్‌‌మానేరు నుంచి మల్ల న్నసాగర్‌‌వరకు పనులకు 18న సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది.

లింక్‌‌ -1, లింక్‌‌-4లో అడిషనల్‌‌టీఎంసీ పనులు చేపట్టేందుకు అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో ఈ నెల 9న ఇంజనీర్లు జల సౌధలో ప్రీబిడ్డింగ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి తొమ్మిది మంది కాంట్రాక్టర్లు హాజరయ్యారు. మీటింగ్‌కు వచ్చిన వారంతా కరోనా వైరస్‌‌వ్యాప్తి నేపథ్యంలో టెండర్లదాఖలు గడువు పెంచాలనే ప్రతిపాదనను ఇంజనీర్లముందు పెట్టారు. తాము బిడ్లతోపాటు సమర్పించాల్సిన బ్యాంక్‌‌గ్యారంటీ, ఇతరత్రా పత్రాలు సమకూ ర్చుకోవడానికి మరికొంత టైం కావాలని వారు కోరారు. లాక్‌‌డౌన్‌‌తో ఈ పనులు సకాలంలో పూర్తి చేయలేమని, రూల్స్సడలించడం తప్ప మరో మార్గం లేదని వారు విజ్ఞ ప్తి చేశారు. బిడ్స్‌‌ దాఖలు చేయడానికి గడువు ఉందని, ఆలోగా అన్నింటి నీ సిద్ధం చేసుకోవాలని ఈ సమావేశం లో ఇంజనీర్లు సూచించారు.