క్యాంప్ ఆఫీసు దగ్గర రేవంత్ రెడ్డి అరెస్ట్

క్యాంప్ ఆఫీసు దగ్గర రేవంత్ రెడ్డి అరెస్ట్

సీఎం క్యాంప్ ఆఫీసు దగ్గర కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు. అయితే .. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి బైక్ పై సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు.  క్యాంప్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన్ను.. అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.