నేటి నుంచి ఆరెస్సెస్ విజయ సంకల్ప శిబిరం

నేటి నుంచి ఆరెస్సెస్ విజయ సంకల్ప శిబిరం

తెలుగు నేలపై దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ భారీ సభను నిర్వహించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధమైంది. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం వేదికగా మంగళవారం నుం చి మూడు రోజుల పాటు ‘విజయ సంకల్ప శిబిరం’ పేరుతో ఆరెస్సెస్ హేమంత శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది . సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శిబిరంలోనే ఉంటూ సంఘ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యా ప్తంగా 8 వేల మంది సంఘ్ సేవకులు ఈ శిబిరంలో పాల్గొ ననున్నారు.

శిబిరాలకు తెలంగాణ పేర్లు

ఇబ్రహీంపట్నంలోని భారత్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద105 ఎకరాల ప్రదేశంలో ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. అతిథులు బసచేసేందుకు ఐదు మండపాలను సిద్ధం చేశారు. వీటికి తెలంగాణ సంస్కృతిని చాటి చేప్పేలా.. జోగులాంబ, యాదాద్రి, భద్రాద్రి, సమక్క–సారక్క, భాగ్యనగరం అనే పేర్లు పెట్టారు. శ్రీరాముడు, మహనీయుల కటౌట్లు, కాకతీయ తోరణం, దేవాలయాల కటౌట్లు పెట్టారు. శిబిరానికి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ శాఖల సంఘ్ ముఖ్యులతో పాటు అనుబంధ సంఘాలైన వీహెచ్ పీ, భజరంగ్ దళ్, హిందూ వాహిని వంటి 34 సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులో పాల్గొ నాల్సిందిగా బీజేపీ జిల్లా, రాష్ట్ర ముఖ్య నేతలకు కూడా సంఘ్ నుంచి ఆహ్వానాలు అందాయి.

రేపు సార్వజనిక సభ

ఉమ్మడి ఏపీలో చివరిసారిగా కరీంనగర్ లో1999లో ఆరెస్సె స్ భారీ శిబిరం నిర్వహించింది. ఆ తర్వాత ఆస్థాయిలో మళ్లీ భారీ శిబిరం నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక శిబిరంలో భాగంగా బుధవారం (25న) సరూర్ నగర్ స్టేడియంలో సార్వజనిక సభ జరుగనుంది. ఈ సభకు 25 వేల మంది సంఘ్ సేవకులు నాలుగు మార్గాల గుండా రూట్ మార్చ్ చేస్తూ స్టేడియంకు చేరుకోనున్నారు. అనంతరం వీరిని ఉద్దేశిం చి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడనున్నారు.

3 రోజుల కార్యక్రమాలు ఇవే..

24వ తేదీ: ఉదయం11 నుం చి సాయంత్రం6.30 వరకు మండపాల్లో సంఘ్ సేవకుల సమావేశాలు. రాత్రి7. 30 నుం చి 9 వరకు శ్రేణిక: బైఠక్. 25వ తేదీ: ఉదయం 10కి సంఘ్ బైఠక్. మధ్యాహ్నం 1కి గణవేశ్ తయారీ. 1. 45 నుం చి 2.45 వరకు పథ సంచలన్ (మార్చ్ ఫాస్ట్). సాయంత్రం 5 నుం చి 7 వరకు సార్వజనికోత్సవ సభ. రాత్రి 7. 15 నుం చి 8. 15 వరకు శిబిరానికి తిరిగి రాక. 26వ తేదీ: ఉదయం 9.30 నుం చి11 వరకు శ్రేణిక: బైఠక్, మధ్యాహ్నం 2. 30 నుం చి 4 వరకు సమారోప్. దీనితో శిబిరం ముగింపు.

రాష్ట్రంలో బలమైన శక్తిగా..

రాష్ట్రంలో ఆరెస్సెస్ బలమైన శక్తిగా ఉంది. రాబోయే రోజుల్లో సంఘ్ ను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం . ఆరెస్సెస్ ను రాష్ట్ర మంతా విస్తరించాలనే లక్ష్యంతో ఈ శిబిరాలను నిర్వహిస్తు న్నాం . రాష్ట్రంలో దాదాపు70 ఏళ్లుగా సంఘ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం . 2024 నాటికి ఆరెస్సెస్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ప్రతి బస్తీకి సంఘ్ శాఖ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతాం.

– ఆరెస్సెస్ రాష్ట్ర ప్రముఖ్ లు దక్షిణమూర్తి, రమేష్