ఎన్నికలకు 73 వేల మంది పోలీసులతో బందోబస్తు: డీజీపీ రవిగుప్తా

ఎన్నికలకు 73 వేల మంది పోలీసులతో బందోబస్తు: డీజీపీ రవిగుప్తా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో  సోమవారం జరగనున్న లోక్‌‌‌‌సభ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. పోలింగ్‌‌‌‌ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల ప్రచారం పర్వం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో డీజీపీ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బందోబస్తుకు  73,414 సివిల్ పోలీసులు,500 స్టేట్‌‌‌‌ స్పెషల్ పోలీస్‌‌‌‌,164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌‌‌‌, తమిళనాడుకు చెందిన మూడు స్పెషల్

ఆర్మీ కంపెనీలు, 2,088 ఇతర శాఖల సిబ్బంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 7 వేల మంది హోంగార్డులను వినియోగిస్తున్నామని వివరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌‌‌‌ కింద తనిఖీల కోసం 482 పిక్స్‌‌‌‌డ్‌‌‌‌ స్టాటిక్ టీమ్స్‌‌‌‌,462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌‌‌‌లు, 89 ఇంటర్-స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్‌‌‌‌లు,173 ఇంటర్ జిల్లా చెక్ పోస్ట్‌‌‌‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటిదాకా జరిపిన తనిఖీల్లో రూ.94.94 కోట్లు నగదు, రూ.93.14 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్‌‌‌‌, మరికొన్ని విలువైన వస్తువులను జప్తు చేశామని వెల్లడించారు.

వివిధ సెక్షన్ల కింద 8,863 ఎస్ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేశామన్నారు. రౌడీ షీటర్స్​తో పాటు ఎన్నికల సమయాల్లో నేరాలకు పాల్పడే 34,526 మందిని బైండోవర్ చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.