‘పెళ్లి ఎప్పుడు అవుతుంది బాబూ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

‘పెళ్లి ఎప్పుడు అవుతుంది బాబూ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

బాలీవుడ్ భాయిజాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ రోజు తన 55వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. డిసెంబర్ 27, 1965లో పుట్టిన ఆయన నేటితో 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55వ వసంతంలోకి అడుగుపెట్టారు. అటు బాలీవుడ్ నుంచి, ఇటు టాలీవుడ్ నుంచి..ఒకటేమిటి అన్ని భాషల నటుల నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. ట్విట్టర్‌లో కూడా సల్మాన్ ఖాన్ బర్త్‌డే విషేస్ ట్రెండింగ్‌లో ఉంది.

1988వ సంవత్సరంలో ‘బీవీ హో తో ఐసీ’ సినిమాలో సపోర్టింగ్ రోల్‌తో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన సల్మాన్.. నేటికీ తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన తన 30 సంవత్సరాల సీని జీవితంలో హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఫోర్బ్స్ 2018 జాబితా ప్రకారం.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 100 మంది సెలబ్రెటీలలో సల్మాన్ 82వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 2018లో ఆయన ఆదాయం 37.7 మిలియన్ డాలర్లు. ఈ విధంగా తన సినీ జీవితంలో డబ్బుతో పాటు, పేరు ప్రతిష్టలు కూడా పెంచుకుంటున్నాడు ఈ కండల వీరుడు. వీటితో పాటు ఆయన వయసు కూడా పెరుగుతూనే వస్తోంది. అయితే వయసు పెరిగినా.. ఇప్పటికీ సల్మాన్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. దాంతో ఆయన అభిమానులు సల్మాన్ పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతోమంది యాంకర్లు, ఎన్నో షోలలో పెళ్లి గురించి అడిగితే ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. అసలు సల్మాన్‌కి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అని చాలామంది అనుకుంటున్నారు. మరికొందరైతే ‘పెళ్లి ఎప్పుడు అవుతుంది బాబూ.. నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబూ’ అంటూ తెలుగు సినిమాకు సంబంధించిన ఓ పాటను పాడుకుంటున్నారు. మరి సల్మాన్ తన 55వ సంవత్సరంలోనైనా పెళ్లి వార్త చెబుతాడేమో చూడాలి.

For More News..

అత్తను రాయితో కొట్టిచంపిన కోడలు

జూలో బాలుడిపై దూకిన పులి.. వీడియో వైరల్