శాంసంగ్ మొబైల్స్: అగ్వకు కొత్త మోడల్స్

శాంసంగ్ మొబైల్స్: అగ్వకు కొత్త మోడల్స్

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం శాంసంగ్ చౌక రెటులో కొత్త మోడల్స్ తెచ్చింది. గెలాక్సీ M సిరీస్ లో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ M10, గెలాక్సీ M20 పేరిట మంచి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. షావోమీ, రియల్ మీ, అసుస్, హానర్ లాంటి బ్రాండ్లను టార్గెట్ చేస్తూ ఎం10, ఎం20 లను రిలీజ్ చేసింది శాంసంగ్.

స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో గట్టి పోటీ ఎదుర్కొంటున్న శాంసంగ్… సరికొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ‘ఇన్ఫినిటీ-వీ’ పేరుతో తొలిసారిగా నాచ్ డిస్ ప్లేతో రూపొందించిన ఫోన్లు ఇవి. 6.2 ఇంచ్ ఇన్ ఫినిటీ వి డిస్ ప్లేతో ఈ ఫోన్ రూపొందించారు. హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఈ ఫోన్ ను డిజైన్ చేశారు. ఇందులో ఉపయోగించిన ప్రాసెసర్ ఎక్సినోస్ 7870 SoC.2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ తో పాటు 3 జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్ వెరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.128 జీబీ వరకు స్టోరేజ్ ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం10 లో ఉపయోగించిన OS ఆండ్రాయిడ్ 8.1 ఓరియో. ఇక 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరాలతో పాటు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఓషియన్ బ్లూ, చార్ కోల్ బ్లాక్ కలర్స్ తో అందుబాటులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్ధ్యం 3,400 ఎంఏహెచ్. ఈ ఫోన్ ధర రెండు వెరియంట్లకు ఫోన్ 7,990 ,8,990 ఉంది. ఇందులో ఫేస్ అన్ లాక్ మాత్రమే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు.

ఇక శాంసంగ్ m20 విషాయానికి వస్తే 6.13 ఇంచ్ ఇన్ ఫినిటీ వి డిస్ ప్లేతో డిజైన్ చేశారు. ఇది ఫుల్ హెచ్ డీ+ రిజల్యూషన్ తో స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2220 పిక్సల్స్ తో ఉంది.ఇందులో ఉపయోగించిన ప్రాసెసర్ ఎక్సినోస్ 7870 SoC. గెలాక్సీ M10 లానే M20 కూడా రెండు ర్యామ్ లతో రిలీజ్ చేశారు….3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ,4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ తో m20 ని డిజైన్ చేశారు.128 జీబీ వరకు స్టోరేజ్ ని ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు .

శాంసంగ్ m20 లో ఉపయోగించిన OS ఆండ్రాయిడ్ 8.1 ఓరియో. 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా,5 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాల తో పాటు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.. శాంసంగ్ నుంచి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోన్న తొలి ఫోన్ ఎం20 కావడం విశేషం. ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండ్రోజులపాటు వాడుకోవచ్చు. ఈ ఫోన్ ధర రెండు వెరియంట్లకు రూ.10,990 ,రూ.12,990 ఉంది.