130 అడుగుల గాంధీ విగ్రహం పెడ్త

130 అడుగుల  గాంధీ విగ్రహం పెడ్త

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: త్వరలోనే సంగారెడ్డిలో 130 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. విగ్రహావిష్కరణకు కాంగ్రెస్‌‌‌‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తానని చెప్పారు. గురువారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు గాంధీజీపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ కంటే గాడ్సే బెటర్ అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓవైపు గాంధీ ఫొటోలు పెట్టుకుని స్వచ్ఛ భారత్ అంటూనే మరోవైపు ఆయనపైనే విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. గాంధీపై ఇష్టమున్నట్లు కామెంట్లు చేస్తే సహించేదిలేదన్నారు.