వరంగల్‍: 76 నామినేషన్లు రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరంగల్‍:   76 నామినేషన్లు రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ముగిసిన స్క్రూట్నీ
  • 15 వరకు ఉపసంహరణ ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరంగల్‍/హనుమకొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల స్క్రూట్నీ నిర్వహించారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేరకు వచ్చిన నామినేషన్లు ఓకే చేయగా, పూర్తి సమాచారం ఇవ్వకపోవడం, ఏ, బీ ఫారాలు అందించని క్యాండిడేట్ల నామినేషన్లను రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు 15 వరకు ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తూర్పులో 37 నామినేషన్లు రాగా ఇందులో కాంగ్రెస్‍ తరఫున నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన కొండా మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, బీజేపీ నుంచి ఎర్రబెల్లి రేణుక, ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి త్రిపురోజు రవికుమార్‍, ఏఐఎఫ్‍బీ నుంచి నరేష్‍, యుగ తులసి పార్టీ నుంచి బైరి వంశీకృష్ణ, ఆజాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమాజ్‍ పార్టీ నుంచి నసీరుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నామినేషన్లను రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పశ్చిమ నియోజకవర్గంలో 35 మంది 55 నామినేషన్లు వేయగా15 మంది నామినేషన్లు రిజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. నర్సంపేటలో 24 నామినేషన్లు రాగా ఐదు, వర్ధన్నపేటలో 26 నామినేషన్లు వస్తే ఆరు తిరస్కరణకు గురయ్యాయి. పరకాలలో 61 నామినేషన్లు రాగా ఐదు నామినేషన్లను ఆఫీసర్లు తిరస్కరించారు. ఇక్కడ ఇద్దరు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే నిర్వాసితులు పోటీలో ఉన్నారు. 

జనగామ జిల్లాలో 27..

జనగామ, వెలుగు : జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 99 మంది నామినేషన్లు వేయగా 27 మంది నామినేషన్లు రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. జనగామ నియోజకవర్గంలో 32 మంది నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తే ఐదు రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా 27 మంది బరిలో ఉన్నారు. స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 28 మంది నామినేషన్లు వేయగా ఐదు, పాలకుర్తిలో 39 నామినేషన్లకు 17 రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. మూడు నియోజకవర్గాల్లోనూ బీఎస్పీ క్యాండిడేట్ల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, పార్టీ బీఫాం ఇవ్వలేదన్న కారణంతో పాలకుర్తిలో జంగా రాఘవరెడ్డి నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను
 రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

డోర్నకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో 19 మంది నామినేషన్లు వేయగా కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరివార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థాపకుడు, ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రమీల నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించారు. ఇక్కడ 17 మంది బరిలో ఉన్నారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 22 నామినేషన్లకు ఏడు రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మురళీనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చలాన్లు చెల్లించేదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఫిర్యాదు చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయన నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమోదించారు. 

ALSO READ : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జిలను లెక్కచేయని అభ్యర్థులు! .. కీలక వ్యవహరాల్లో వారి ప్రమేయం జీరో

భూపాలపల్లిలో వయసు తక్కువ ఉండడంతో...

భూపాలపల్లి అర్బన్/ములుగు, వెలుగు : భూపాలపల్లి నియోజకవర్గంలో 26 మంది నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయగా వయస్సు తక్కువగా ఉందన్న కారణంతో యుగతులసి క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్పూరి శివకృష్ణ నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించారు. ములుగులో 18 మంది క్యాండిడేట్లు నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయగా, రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.