మహిళలకు భరోసా ఇస్తున్న షీ టీమ్స్

మహిళలకు భరోసా ఇస్తున్న షీ టీమ్స్

షీ టీమ్స్ సక్సెస్ ఫుల్ గా ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడేళ్లలో ఆన్లైన్ వేధింపుల కేసులే అధిక శాతం నమోదు అయ్యాయి. ఇక గతంతో పోల్చితే షీ టీమ్స్ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చిందంటున్నారు అధికారులు. షీటీమ్స్ అందుబాటులో రావడంతో  కాలేజీలు, బస్ స్టాపులు, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న పోకిరీలకు చెక్ పెడుతున్నారు అధికారులు.

అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆవారాగాళ్ళను నిర్భయ యాక్ట్ తో కటకటాల్లోకి నెట్టుతున్నారు షీటీమ్స్. ఇక రిపీటెడ్ గా వేధింపులకు దిగుతన్న వారిపై పీడీ యాక్ట్ తో జైలుకు పంపుతున్నాయి. సిటీలో మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ విజయవంతంగా ముందుకు వెళ్తున్నాయి. సక్సెస్ ఫుల్ గా ఏడు ఏళ్లు పూర్తి చేసుకంది షీటీమ్స్ .. ఈ ఏడేళ్లలో ఎన్నో సంస్కరణలు మరెన్నో బాదితల కోసం పరిష్కారాలను ముందుంచి శబాష్ షీ టీమ్ అని పించుకుంటున్నారు.

మహిళా రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని కఠినమైన శిక్షలు అమల్లోకి వచ్చినా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. మహిళలపై జరుగుతున్న దాడులు, సోషల్ మీడియాలో అనుదినం పెరిగిపోతున్న వేధింపులు 'ఆమె' లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు స్టేట్ లో షీ టీమ్స్ మంచి విజయాలు సాధిస్తున్నాయి. కళాశాలకు వెళ్ళే విద్యార్ధినులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగినులు, ఐటీ కారిడార్ ల్లో పనిచేస్తున్న దేశ విదేశాల యువతులకు అండగా మేమున్నామని భరోసా కల్పిస్తున్నాయి. అందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో షీ టీమ్స్ ను ప్రారంభించింది రాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్.

ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షీ టీమ్స్ వర్క్ ప్రోగేస్ ను విడుదల చేసింది. ఇంటర్నెట్ , సోషల్ మీడియా తో మానసికంగా వేధింపులు అధిక శాతం నమోదు అవుతున్నట్లు షీటీమ్స్ గర్తించింది. స్టేట్ వైడ్ గా  35వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. 2014 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు ఈ  కేసులు రిపోర్టు అయినట్లు షీటీమ్స్ ప్రోగ్రెస్ రిపోర్టు రెడీ చేసింది. మొదట్లో 2014 లో కేవలం ఏడు ఎఫ్ఐఆర్ లు రిపోర్టు కాగా ప్రసుత్తం .. వివిధ కేసుల్లో 3853 ఎఫ్ఆర్ లను షీటీమ్స్ రిజిస్టర్ చేసింది. 10321 మంది బాదితులకు కౌన్సెలింగ్ తో షీటీమ్స్ సమస్యలు వివాధాలను పరిష్కరించింది. 

2014 నుంచి ఇప్పటి వరకు షీటీం కు అందిన ఫిర్యాదులు.. ఎమర్జెన్సీ డైల్ 100 తో  3754 కేసులు రాగా , ఫేస్ బుక్  392, వాట్సాప్ ద్వారా 14752, హాక్ఐ యాప్ తో 1473, ఈ మేయిల్ 826, ట్విటర్ 102, నేరుగా షీటీం కు కంప్లైంట్ చేసిన వారు 13342 మంది ఉండగా ఇక రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వారు 600లకు పైగా ఉన్నారు. మొత్తం వివిధా ప్లాట్ ఫాం ద్వారా 35 వేలకు పైగా కేసులు షీ టీమ్ కు అందాయి . వేధింపులు ఎదుర్కొనే యువతులు వాట్సాప్,ఈమెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్, హాక్ ఐ లాంటి సోషల్ మీడియాలో లేక నేరుగా వచ్చి తమకు ఫిర్యాదు చేయాలంటున్నారు. బాదితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు షీటీం ఆఫిషల్స్.