ప్రగతిభవన్ ముట్టడించిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు

ప్రగతిభవన్ ముట్టడించిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు

ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాత పద్ధతిలోనే  పోలీస్ ఈవెంట్స్ జరపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. పోలీసులు వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపు అక్కడ అభ్యర్థులకు పోలీసులకు మధ్య  తోపులాట జరిగింది.


పాత విధానంలోనే కానిస్టేబుల్, ఎస్సై రిక్రూట్ మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. దేశంలో 4 మీటర్ల లాంగ్ జంప్ ఎక్కడా లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 200 మార్కుల క్వశ్చన్ పేపర్‭లో 20 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని మండిపడుతున్నారు.పేద విద్యార్థుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారని.. విద్యార్థుల డబ్బులతోనే రిక్రూట్‭మెంట్స్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. లాంగ్ జంప్ కారణంగా వందల మంది కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు అర్హులు కాకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.