సెప్టిక్ ట్యాంక్ లో దిగి ఆరుగురు మృతి

సెప్టిక్ ట్యాంక్ లో దిగి ఆరుగురు మృతి

జార్ఖండ్ లో కొత్తగా కట్టిన సెప్టిక్ ట్యాంక్ లో సెంట్రింగ్మెటీరియల్ తీసేందుకు ప్రయత్నించిన కూలీలు, కాంట్రాక్టర్ సహా ఆరుగురు చనిపోయారు. మొదట ట్యాంక్ లో దిగిన కూలీ ఎంత సేపటికీ బదులివ్వకపోవడం తో మరో కూలీ లోపలికి దిగిండు. లోపలి నుంచి ఎలాంటి చప్పుడు లేకపోవడంతో ఏంజరిగిందో తెలుసుకోవడానికి ఈసారి కాంట్రాక్టర్ ట్యాంక్ లో దిగిండు. తర్వాత ఆయన కొడుకులిద్దరు, తర్వాత మరో కూలీ కూడా లోపలికి వెళ్లిబయటకు రాకపోవడంతో మిగతా కూలీలు అలర్ట్ అయ్యారు. ట్యాంకులోకి దిగిన వాళ్లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు చెప్పారు. పదిహేను రోజుల క్రితం కట్టిన సెప్టిక్ ట్యాంకులో విష వాయువులు ఏర్పడి ఉంటాయని, వాటిని పీల్చడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అన్నారు. జార్ఖండ్ లోన డియోగఢ్ లో ఆదివారం జరిగిన ఈ ప్రమాదం వవరాలను అధికారులు మీడియాకు తెలిపారు.

 ఒకరి వెనక ఒకరు..

సిటీలోని దేవీపూర్ మార్కెట్ ఏరియాలో బర్న్ వాల్ ఓ సెప్టిక్ చాంబర్ కట్టించారు. దాదాపు 20 ఫీట్లలోతు, 7 ఫీట్ల వెడల్పుతో కట్టిన ఈ చాంబర్ లో సెంట్రిక్ మెటీరియల్ ను ఊడదీసేందుకు కాంట్రాక్టర్ ఆదివారం కూలీలను తీసుకొచ్చాడు. ఇందులో మొదట లీలూ ముర్ము అనే కూలీ ట్యాంక్ లోకి దిగిండు. దిగి చాలా సేపైనా లోపల పనిచేస్తు న్న శబ్దాలే మీ రాకపోవడంతో పై నుంచి మరో కూలీ ముర్మును పిలిచాడు. బదులు రాకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మరో కూలీ లోపలికి దిగిండు. ఆ తర్వాత కాంట్రాక్టర్ గోవింద్ మాంఝీ, అతని ఇద్దరు కొడుకులు, బర్న్ వాల్.. ఒక్కొక్క రూ వరుసగా లోపలికి దిగి , బయటికి రాలేదు. దీంతో మిగతా వాళ్లు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఎక్స్ పర్ట్స్ ను రప్పించి ట్యాంకును కూల్చేశారు. లోపల చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి, ఆస్ప త్రికి తరలించారు. అయితే, అప్పటికే వాళ్లందరూ చనిపోయారని డాక్టర్లు చెప్పారు. ట్యాంకు లోపల కెమికల్ రియాక్షన్స్ కారణంగా విష వాయువులు ఏర్పడడంవల్ల కూలీలంతా ఊపిరాడక చనిపోయి ఉంటారని అన్నారు.