స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు కరోనా సవాల్​

స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు కరోనా సవాల్​

న్యూఢిల్లీ: ఇండియాలో తొలిసారిగా స్మార్ట్‌‌‌‌ఫోన్ల మార్కెట్‌‌‌‌ గ్రోత్ ‌‌‌‌తగ్గుతుందని తేలింది. కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌వల్ల అమ్మకాలు బాగా తగ్గుతాయని తాజా స్టడీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 13–15 శాతం వరకు తగ్గుతాయని మార్కెట్‌‌‌‌రీసెర్చ్‌‌‌‌సంస్థ ఇంటర్నేషనల్‌‌‌‌డేటా కార్పొరేషన్‌‌‌‌(ఐడీసీ) తాజా సర్వే పేర్కొంది. గత ఏడాది 15.8 కోట్ల వరకు స్మార్ట్‌‌‌‌ఫోన్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది ఇవి 13 కోట్లకు తగ్గుతాయని అంచనా వేసింది. ప్రొడక్షన్‌‌‌‌కూడా భారీగా తగ్గుతుందని ఇది స్పష్టం చేసింది.

అమ్మకాలు తగ్గడానికి కారణాలు ఇవి…

ఐడీసీ సర్వే ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌వల్ల కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా మంది జీతాలు తగ్గాయి. వ్యాపారాలు ఎన్నడూ లేనంత నష్టపోయాయి. దాదాపు అన్ని వర్గాల ఆదాయాలు తగ్గాయి. స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌కొనాలనుకునేవారు మరికొంత కాలం ఆగుతారు లేదా వాయిదా వేస్తారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌సమస్యల వల్ల కంపెనీలు ఫోన్లను ఎక్కువగా తయారు చేయలేకపోతున్నాయి. స్మార్ట్‌‌‌‌ఫోన్ల అమ్మకాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడంతో రేట్లు ఎక్కువయ్యాయి.

ఎంత తగ్గుతాయంటే…

ఈ ఏడాది 14 కోట్ల యూనిట్లు అమ్ముడవుతాయని మొదట భావించారు. కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తరువాత ఈ అంచనాను ఐడీసీ 13 కోట్ల యూనిట్లకు తగ్గించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 15.8 కోట్ల వరకు స్మార్ట్‌‌‌‌ఫోన్లు అమ్ముడుపోయాయి. ఫీచర్‌‌‌‌ఫోన్ల అమ్మకాలు 42 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది ఇవి 13 కోట్ల దాకా అమ్ముడయ్యాయి. ఈసారి సేల్స్‌‌‌‌7.5 కోట్లు దాటకపోవచ్చని భావిస్తున్నారు. వలస కూలీలు పనులను వదిలేసి సొంతూళ్లకు వెళ్లిపోవడం, పనులు దొరక్కపోవడం వల్ల ఫీచర్‌‌‌‌ఫోన్ల అమ్మకాలు పడిపోతాయని భావిస్తున్నారు.