శ్రీలంకలో అడుగడుగునా నిఘా వైఫల్యం

శ్రీలంకలో అడుగడుగునా నిఘా వైఫల్యం

శ్రీలంకలోని పలు చర్చిలు, భారత హైకమిషన్​పైనేషనల్​ తౌహీద్ జమాత్ (ఎన్​టీజీ) టెర్రరిస్టు సంస్థదాడులకు ప్లాన్​ చేసిందని 20 రోజుల క్రితమే విదేశీ ఇంటెలిజెన్స్‌‌ సంస్థలు శ్రీలంక చీఫ్​ నేషనల్​ ఇంటెలిజెన్సీకి సమాచారం అందించాయి. దీంతో శ్రీలంక ఇంటెలిజెన్స్‌‌ అధికారులు ఇన్స్​పెక్టర్ జనరల్​ ఆఫ్​ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయ సుందేర ఈ నెల 11న భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. అయినా.. పేలుళ్లను నిలువరించలేకపోయారు. దీని వెనుక భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తు ఆ దేశప్రధాని విక్రమ సింఘేనే దీనిని అంగీకరించారు. ఇంటర్నేషనల్​ ఇంటెలిజెన్స్‌‌ ఏజెన్సీ నుంచి ఈ నెల 4న హెచ్చరికలు వచ్చాయి. ఐజీపీకి సమాచారం వెళ్లింది.అయినా ఘోరం జరిగిపోయింది. ఐజీపీ పుజిత్ జయసుందేరను రాజీనామా చేయాల్సిందిగా కోరాం”అని శ్రీలంక మంత్రి రజితా సేనారత్నే తెలిపారు.ముందే హెచ్చరికలొచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని ఐజీపీని ఆదేశించామన్నారు .పేలుళ్ల గురించి ముందస్తుగా నిఘా రిపోర్టు ఉన్నాఎందుకు సీరియస్ గా తీసుకోలేదో అర్థం కావడం లేదని మరో మంత్రి హరిన్​ ఫెర్నాండో పేర్కొన్నారు .

మూడు నెలలుగా స్కెచ్

రాడికల్​ ముస్లిం వర్గానికి చెందిన ఎన్​టీజీ.. వరుస పేలుళ్ల కోసం మూడు నెలల నుంచి పక్కా ప్లాన్​ వేసినట్లు తెలుస్తోంది. సూసైడ్ బాంబర్లు కొలంబో శివారులోని పనాదురాలోని ఓ ఇంట్లో మకాం వేసి వ్యూహాన్నిరచించారు. ఆ ఇంటిని సోమవారం అధికారులు గుర్తించారు. పరిసరాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు .సూసైడ్ బాంబర్లు మొత్తం స్థానికులేనని అధికారులు అంటున్నారు . వరుస పేలుళ్లకు ఏ టెర్రరిస్టు సంస్థబాధ్యత వహిస్తూ ప్రకటన చేయకపోయినప్పటికీ ఎన్​టీజీపైనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటి వరకు 24 మంది అనుమానితులను పోలీసులు అరెస్టుచేశారు. వారికి ఎన్​టీజీతో సంబంధాలు ఉన్నట్లు,వారు కూడా స్థానికులేనని పోలీసులు తెలిపారు.ఎవరికీ పెద్దగా తెలియని నేషనల్ తౌహీద్ జమాత్ గ్రూపు.. గత ఏడాది జరిగిన ఓ చిన్న ఘటనతో వెలుగులోకి వచ్చింది. గత ఏడాది డిసెంబర్ లో మార్వనెల్లా పట్టణంలో కొన్ని బుద్ధ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ కేసులో పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఓ మతప్రచారకుడి అనుచరులని, నేషనల్​ తౌహీద్ జమాత్ గ్రూపును నడుపుతున్నట్లు తేలింది. తాజాగా జరిగిన వరుస పేలుళ్ల వెనుక ఇదే సంస్థ ఉందని విదేశీ నిఘా సంస్థలతోపాటు స్థానిక ఇంటెలిజెన్స్​ వర్గాలు కూడా బలంగా నమ్ముతున్నాయి. ‘‘ఎన్​టీజీపై అనుమానాలుఉన్నాయి. మూడు చర్చిల్లో , మూడు ఫైవ్ స్టార్ హోటళ్లలో ఇదే సంస్థ దాడులు జరిపినట్లు రిపోర్టులు అందుతున్నాయి”అని మంత్రి రజితా సేనారత్నే అన్నారు .ఎన్​టీజీకి అంతర్జాతీయ సాయం అందిందా ? అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి దాడులతో విదేశాల్లోని టెర్రరిస్టు సంస్థలకు కూడా లింకులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.పేలుళ్లపై విచారణకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.రెండు వారాల్లో నివేదికను అందజేయాలని కమిటీని ఆయన ఆదేశించారు.