ఎమ్మెల్సీ పోలింగ్​ రోజు హాఫ్​ డే లీవ్​ ఇవ్వాలి

ఎమ్మెల్సీ పోలింగ్​ రోజు హాఫ్​ డే లీవ్​ ఇవ్వాలి

హైదరాబాద్, వెలుగు: వరంగల్,​ ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్​ఎమ్మెల్సీ పోలింగ్​ రోజు వేతనంతో కూడిన హాఫ్​ డే లీవ్​ ఇచ్చేలా అన్ని శాఖలను ఆదేశించాలని సీఈవో వికాస్​ రాజ్​కు కాంగ్రెస్​ విజ్ఞప్తి చేసింది.

  శనివారం పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్, కాంగ్రెస్​ పార్టీ ఎలక్షన్​ కమిషన్​కో ఆర్డినేషన్​ కమిటీ చైర్మన్​ జి. నిరంజన్​ సీఈవోకు లేఖ రాశారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నిక ఉందని, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు  ఓటు హక్కును వినియోగించుకునేందుకు సెలవు ఇచ్చేలా ప్రభుత్వ శాఖలను ఆదేశించాలని కోరారు.