మొదలైన రాష్ట్ర కేబినెట్ సమావేశం

మొదలైన రాష్ట్ర కేబినెట్ సమావేశం

హైదరాబాద్ సీఎం క్యాంపు ఆఫీస్ లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేం ప్రారంభమైంది. సాయంత్రం నాలుగింటికి ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులతో సమావేశం అయ్యారు. కొత్త సెక్రటేరియట్ డిజైన్ లు, సెక్రటేరియట్ కూల్చివేత, ఉద్యోగుల సమస్యలు, PRC సమ్మె, రిటైర్మెంట్ ఏజ్ 58 నుంచి 61 ఏళ్లకు పెంపు లాంటి బర్నింగ్ టాపిక్ లపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారని సమాచారం. ఈ మీటింగ్ లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ నెల 5 నుంచి ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చారు ఉద్యోగులు, కార్మికులు. పండుగ పూట ప్రజలకు రవాణా విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సంతృప్తి కలిగించేలా ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.  కొత్త ఎక్సైజ్ పాలసీ… నీరా పాలసీ.. కోర్టుల్లో  పోస్టుల భర్తీ, రైతు సమన్వయ సమితులు, ధాన్యం కొనుగోలు, ఆంధ్రప్రదేశ్ తో జల వనరుల సంబంధాలు, గోదావరి నీళ్లను శ్రీశైలం మళ్లించే అంశాలు కూడా చర్చకు వస్తాయని తెలుస్తోంది.

హుజూర్ నగర్ బైపోల్ పైనా చర్చ!

కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత… క్యాంప్ ఆఫీస్ లో మంత్రులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. హుజూర్ నగర్ బై ఎలక్షన్ ను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో… గెలుపు కోసం ఏం చేయాలన్నదానిపై మంత్రులతో కేసీఆర్ డిస్కస్ చేయబోతున్నారు.

కేబినెట్ సమావేశం పూర్తయ్యాక సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే చాన్సెస్ ఉన్నాయి.