లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • సెన్సెక్స్‌‌ 685 పాయింట్లు అప్‌‌
  • 4 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

 

ముంబై: ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌, బ్యాంకింగ్‌‌‌‌, ఫైనాన్షియల్ షేర్లు దూసుకుపోవడంతో , నిఫ్టీలు శుక్రవారం ర్యాలీ చేశాయి. ఇంట్రాడేలో 1,200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌‌‌‌, చివరికి 685 పాయింట్ల (1.20 శాతం) లాభంతో 57,920 వద్ద ముగిసింది. నిఫ్టీ 171 పాయింట్లు ఎగిసి 17,186 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌‌‌‌లో ఇన్ఫోసిస్ షేర్లు ఎక్కువగా (4 శాతం)  లాభపడ్డాయి.  హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, హెస్‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్‌‌‌‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్‌‌‌‌ షేర్లూ మార్కెట్‌‌‌‌ ర్యాలీకి సాయపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్‌‌‌‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌, విప్రో, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌గ్రిడ్‌‌‌‌, మారుతి షేర్లు మాత్రం నష్టాల్లో క్లోజయ్యాయి. ‘మధ్యాహ్నం సెషన్‌‌‌‌లో  ప్రాఫిట్‌‌‌‌ బుకింగ్ చోటుచేసుకోవడంతో  బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌ల లాభాలు కొంత తగ్గాయి. బ్యాంకింగ్‌‌‌‌, ఐటీ సెక్టార్లలోని షేర్లలో కొనుగోళ్లు బాగా జరిగాయి’ అని హెమ్ సెక్యూరిటీస్‌‌‌‌ ఫండ్ మేనేజర్‌‌‌‌‌‌‌‌ మోహిత్ నిగమ్ అన్నారు. మార్కెట్‌‌‌‌ గత రెండు వారాలుగా కన్సాలిడేట్ అయ్యిందని, త్వరలో ఈ ఫేజ్‌‌‌‌ నుంచి బయటకొస్తుందని  రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గ్లోబల్‌‌‌‌గా అనిశ్చితి ఉన్నా  నిలకడగా కదిలిన సెక్టార్లు, షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాలని సలహాయిచ్చారు.

ఫారెక్స్ నిల్వలు, ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ పైకి.. 
అక్టోబర్ 7 తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్‌‌ నిల్వలు 204 మిలియన్ డాలర్లు పెరిగి 532.868 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గోల్డ్‌‌ వాల్యూ పెరగడంతో ఫారెక్స్ నిల్వల విలువ పెరిగిందని ఆర్‌‌‌‌బీఐ పేర్కొంది. అంతకు ముందు వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 4.854 బిలియన్ డాలర్లు పడి 532.664 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మరోవైపు సెప్టెంబర్‌‌‌‌లో దేశ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 4.82% పెరిగి 35.45 బిలియన్‌‌ డాలర్లకు చేరుకున్నాయి.  ఇంపోర్ట్స్ 8.66 % పెరిగి 61.61 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ట్రేడ్ డెఫిసిటీ 25.71 బిలియన్‌‌ డాలర్లకు పెరిగింది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య దేశ ఎగుమతులు 231.88 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 380.34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ట్రేడ్ డెఫిసిటీ  148.46 బిలియన్‌‌ డాలర్లకు ఎగిసింది.