27 వేల ఇంజనీరింగ్​ సీట్లకు 16 వేలే భర్తీ

27 వేల ఇంజనీరింగ్​ సీట్లకు 16 వేలే భర్తీ

మేనేజ్​మెంట్​ కోటాలోనూ చేరలె

హైదరాబాద్​, వెలుగు: ఇంజనీరింగ్​పై స్టూడెంట్లకు ఆసక్తి తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. కన్వీనర్​ కోటాతో పాటు మేనేజ్​మెంట్​ కోటాలోనూ సీట్లు మిగులుతున్నాయి. ఈ ఏడాది 169 ప్రైవేటు కాలేజీల్లోని 69 వేల కన్వీనర్​ కోటా సీట్లలో 42 వేలే భర్తీ అయ్యాయి. స్పాట్​ కౌన్సెలింగ్​లో మరో 3 వేలు నిండాయి. 24 వేల సీట్లు భర్తీ కాకుండానే మిగిలాయి. 27 వేల మేనేజ్​మెంట్​ కోటా సీట్లలో భర్తీ అయ్యింది 16 వేలే. గతేడాదితో పోలిస్తే ఈ సారి సీట్లు బాగానే మిగిలాయి. గతేడాది మేనేజ్​మెంటు సీట్లు 29 వేలుంటే 18,500 మాత్రమే భర్తీ అయ్యాయి. ఏటా ఆ కోటా సీట్లు పెరుగుతున్నా ఈ ఏడాది 2 వేల సీట్లు తగ్గించారు. అయినా భర్తీ కాలేదు. క్యాంపస్​ ప్లేస్​మెంట్లు తగ్గి స్టూడెంట్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాదీ ఇదే కొనసాగితే చాలా కాలేజీలు మూతపడతాయని కాలేజీల మేనేజ్​మెంట్​ యూనియన్​ ప్రతినిధి తెలిపారు.

Students seem to be losing interest in engineering