మణిపూర్ ఘటన.. కేంద్రానికి సుప్రీం ఆరు ప్రశ్నలు

మణిపూర్ ఘటన.. కేంద్రానికి సుప్రీం ఆరు ప్రశ్నలు

మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న హింసను ఎదుర్కోవడానికి విస్తృత యంత్రాంగాన్ని రూపొందించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేసును కేవలం సీబీఐ, సిట్ కు అప్పగిస్తే సరిపోదని చెప్పింది. దీనికి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఇందులో మహిళా న్యాయమూర్తులు కూడా ఉంటారని చెప్పింది. ఈ కమిటీ మణిపూర్ లో ఏం జరిగిందో గుర్తిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తీసుకున్న చర్యలపై సంతృప్తి చెందకపోతే.. తామే యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. 

మే నుంచి ఇప్పటి వరకు మణిపూర్ లో జరిగిన ఘటనలపై ఎన్ని FIRలు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మణిపూర్ హింసాకాండపై దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించగా..బాధితుల తరఫున కపిల్ సిబిల్ వాదించారు. మణిపూర్ అల్లర్లపై దర్యాప్తును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తే.. కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు తుషార్ మెహతా. ఈ కేసులో సీబీఐ విచారణతో పాటు.. కేసును అసోంకు బదిలీ చేయడంపై మహిళలు వ్యతిరేకిస్తున్నారన్నారు కపిల్ సిబల్. అత్యాచార బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పాలంటే పౌరసమాజంతో కూడిన కమిటీని వేయాలని సీనియర్ న్యాయవాది వాదించారు.

మణిపూర్ లో గసగసాల సాగు, సీమాంతర ఉగ్రవాదం, అల్లర్లపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మణిపూర్ లో నగ్నఊరేగింపులు ఆందోళనకు గురిచేశాయని ధర్మాసనం తెలిపింది. ఈ ఘటనలో కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే.. న్యాయస్థానమే చర్యలు చేపడుతుందని చెప్పింది. ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారోచెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు జార చేసింది.