- అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
సూర్యాపేట, వెలుగు: హైదరాబాద్– చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను చేర్చి, స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సూర్యాపేట తెలంగాణ– -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలక ప్రాంతమన్నారు.
గతంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను చేర్చినప్పటికీ, ప్రస్తుతం పరిశీలిస్తున్న మూడో అలైన్‌మెంట్‌లో తొలగించడం జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లాలో 20 ఏండ్లుగా రైల్వే మార్గం కోసం పోరాటాలు జరుగుతున్నాయన్నారు. సూర్యాపేటకు రైల్వే సౌకర్యం కల్పించడం ద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
