అర్వపల్లి ఎస్సై సస్పెన్షన్..కీలకకేసు వ్యవహారంలో నిర్లక్ష్యం

అర్వపల్లి ఎస్సై సస్పెన్షన్..కీలకకేసు వ్యవహారంలో  నిర్లక్ష్యం

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఈటా సైదులును బుధవారం ఎస్పీ కె.నరసింహ సస్పెండ్ చేశారు. ఇటీవల ఎస్పీ నరసింహ సడన్ విజిట్ లో భాగంగా అర్వపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేయగా అతడు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా, ఒక కీలక కేసు వ్యవహారంలో అనుచిత ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను సీరియస్‌‌‌‌గా పరిగణించి తక్షణ చర్యగా సస్పెన్షన్ వేటు వేశారు.