అది మా నాన్న పార్టీ.. నాకు ఎలాంటి సంబంధం లేదు

అది మా నాన్న పార్టీ.. నాకు ఎలాంటి సంబంధం లేదు

తన పొలిటికల్ ఎంట్రీపై తమిళ హీరో విజయ్ క్లారిటీ ఇచ్చారు.  రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పాడు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం అసలు లేదన్నారు. ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకం పార్టీ నాకు సంబంధిం చినది కాదన్నారు.. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దానిని స్థాపించారని… ఆ పార్టీతో నేరుగా కానీ పరోక్షంగా కానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏ విధంగానూ ఇందులో తాను భాగం కాలేదన్నారు. ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేని తనను ఇరికించాలని చూసినా.. ప్రచారంలో తన ఫొటోలు వాడినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

తమిళనాడులో ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకం అనే పేరుతో పార్టీ రిజిస్టర్ అయ్యింది. అయితే అందరూ విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. ఈ పార్టీని విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రిజిస్టర్ చేయించాడు. అయితే విజయ్ కు తెలియకుండా తన తండ్రి పార్టీని స్థాపించబోరనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ పెట్టడం, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్.. మరో వైపు విజయ్ పేరుతో పార్టీ ,ఇవన్నీ చూస్తుంటే తమిళ పాలిటిక్స్ లో ఏం జరుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.