ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటంతో ఉద్యోగులకు కొత్త‌ మార్గదర్శకాలు జారీ చేసింది. జూన్ -22 నుంచి జూలై-04 వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులతోనే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. 50 శాతం ఉద్యోగులు ఒక రోజు ఆఫీసుకు వ‌స్తే, మిగ‌తా 50 శాతం ఉద్యోగులు మ‌రో రోజు వ‌చ్చే వెసులుబాటు క‌ల్పించింది. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రత్యేక మార్గదర్శకాలను శ‌నివారం జారీ చేసింది.

నాల్గో తరగతి సిబ్బంది, క్లర్క్స్‌, సర్క్యులేట్‌ ఆఫీసర్స్‌కు రోజు విడిచి రోజు డ్యూటీలు అధికారులు ప్రత్యేక చాంబర్‌లో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్‌ అధికారులు, అసిస్టెంట్ సెక్షన్‌ అధికారులు సహా..ఉద్యోగులంతా అందుబాటులోఉండాలంది. అధికారులు, సిబ్బందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఇంటే వద్దే ఉండాలని, ప్రతిరోజు ఆఫీసు పరిసరాల్లో శానిటైజ్‌ చేయాల‌ని సూచించింది. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగులు ఏసీలు వాడ‌కుండా ఉంటే మంచిద‌ని వెల్ల‌డించింది.