టెలిగ్రామ్‌కు 100 కోట్ల డౌన్‌లోడ్లు 

టెలిగ్రామ్‌కు 100 కోట్ల డౌన్‌లోడ్లు 

అతిపెద్ద మార్కెట్ ఇండియానే 
 ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డౌన్‌లోడ్లను దాటిందని సెన్సార్ టవర్ రిపోర్టు పేర్కొంది. టెలిగ్రామ్ 2013లో మొదలయింది. కొన్ని రోజుల క్రితమే  100 కోట్ల డౌన్‌లోడ్ల మైలురాయిని చేరుకుంది. ఇందుకోసం సంస్థకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది. టెలిగ్రామ్‌ కస్టమర్లలో 22 శాతం మంది ఇండియన్ యూజర్లే!    డౌన్‌లోడ్‌ల పరంగా చూస్తే భారతదేశం తమకు అతిపెద్ద మార్కెట్ అని టెలిగ్రామ్ పేర్కొంది. టెలిగ్రామ్ డౌన్‌లోడ్‌లు 2021 నుంచి ఊపందుకున్నాయి. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై కొంత వ్యతిరేకత రావడం టెలిగ్రామ్‌కు కలిసి వచ్చిందని చెప్పోచ్చు. ఇండియా తరువాత రష్యా తమకు అతిపెద్ద మార్కెటని కంపెనీ తెలిపింది.   ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల డౌన్‌లోడ్ల రికార్డు సాధించిన 15వ యాప్‌గా టెలిగ్రామ్ నిలిచింది.