తెలియదు, లేదు, కాదు… జడ్జి ప్రశ్నలకు హాజీపూర్ నిందితుడి జవాబులు

తెలియదు, లేదు, కాదు… జడ్జి ప్రశ్నలకు హాజీపూర్ నిందితుడి జవాబులు

హాజీపూర్ వరుస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని నల్లగొండ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించారు. CRPC సెక్షన్ 313 కింద శ్రీనివాస్ రెడ్డి ఎగ్జామినేషన్ చేసిన న్యాయస్థానం… అతడి వాదనలు వింది. హత్య కేసులలో ఇప్పటివరకు 101 మంది సాక్షుల స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది కోర్టు. ఇందులో 29 మంది సాక్షుల వాంగ్మూలాన్ని విచారణ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డికి వినిపించింది. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు లేదు, తెలియదు, కాదు అని మొక్కుబడిగా జవాబు ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి. కేసు తదుపరి విచారణ జనవరి 3కి వాయిదా వేసింది కోర్టు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ కు చెందిన ఇద్దరు బాలికలు,  మైసిరెడ్డిపల్లికి చెందిన మరో బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశాడు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి. దీంతో పోలీసులు ఇతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.  ఈ కేసులో రెండు నెలలుగా కేసులో 300 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబాల సభ్యులు.

The court adjourned the Hajipur murder case to January 3