కోడి పుంజు కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి

కోడి పుంజు కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి

జగిత్యాల జిల్లా: కోడి పుంజు కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా, గొల్లపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోడి పందేలు ఆడటానికి కోడి కాలికి కత్తి కట్టగా.. కోడి జంప్ చేసింది..దీంతో కడుపు భాగంలో కత్తి గుచ్చుకుని సత్తయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.