చర్మంపై ముడుతలు పడితే ఏం చేయాలంటే..

చర్మంపై ముడుతలు పడితే ఏం చేయాలంటే..

చలికాలం చర్మం మడుతలు పడుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మడుతలు పడితే ఏం చేయాలి..? అసలు ముడుతలే పడకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దీనిపై రకరకాల సందేహాలు వస్తుంటాయి. అన్నింట్లోకి బెటరైన కొన్ని మార్గాలపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి. వాటిలో బెటరైన కొన్ని సూచనలు మీకోసం…

అవసరమనుకుంటే తప్ప ఎక్కువ ఎండకు ఎక్స్ పోజ్ కావద్దు. ముఖ్యంగా చలికాలంలో చలిని తట్టుకోవడానికి చాలామంది ఎండలోకి వెళ్లి నిలబడుతుంటారు. అయితే ఇది మార్నింగ్ టైంలో అయితే మంచిదే. కానీ మధ్యాహ్నం టైంలో ఎక్కువగా ఎండకు ఎక్స్ పోజ్ కాకూడదు. చలికి, ఎండకు చర్మం కమిలిపోతుంది. ముడతలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.

చాలామంది ముఖానికి మాత్రమే మాయిశ్చరైజింగ్ క్రీములు రాస్తుంటారు. కానీ ముఖంతో పాటు మెడ, నుదుటిపై
కూడా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేయాలి.

డైలీ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే ముడతలకు దూరంగా ఉండొచ్చు.

కనిపించిన క్రీములన్నీ చర్మానికి రాయకూడదు. ఏ క్రీములో ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఉందో దాన్నే వాడటం మంచిది.

ఈ సీజన్‌లో విటమిన్ సి ఉండే ఫుడ్ ఎక్కువగా తినాలి.

స్మోకింగ్ చేసే వాళ్ల చర్మం తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.

ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మం హెల్దీగా ఉంటుంది.