Office Peacocking: కార్పొరేట్ సరికొత్త ట్రెండ్..ఆఫీసుల్లో ఇంటి వాతావరణం

Office Peacocking: కార్పొరేట్ సరికొత్త ట్రెండ్..ఆఫీసుల్లో ఇంటి వాతావరణం

కరోనా మహమ్మారితో ఆఫీసు వర్క్ కల్చర్ లో చాలా మార్పులు వచ్చాయి. కరోనా సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ చేశారు. దా దాపు రెండేళ్లపాటు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు. కరోనా తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి పనిచేస్తున్నారు. అయితే ఇంటి నుంచి పని చేసేం దుకు బాగా అలవాటు పడిన కార్పేరేట్ సంస్థల ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసేందుకు ఏమాత్రం ఇష్ట పడటం లేదు. అందుకే కార్పొరేట్ సంస్థలు ఓ కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చాయి. అదేంటంటే.. ఆఫీస్ పీకాకింగ్..

ఆఫీస్ పీకాకింగ్ అనేది  కొంత కాలంగా వర్క్‌ప్లేస్‌లలో ట్రెండింగ్‌ అవుతోంది. ఈ ట్రెండ్ తో ముఖ్యంగా  ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తు న్నాయి కార్పొరేట్ కంపెనీలు. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం, ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడిపేందుకు ప్రోత్సహిస్తున్నాయి. 

ఆఫీస్ పీకాకింగ్ ట్రెండ్ తో ఆఫీసులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. మనం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లుగానే సోఫాలు, వివిధ రకాల డెకరేషన్లు, సన్ లైట్, క్యూబికల్  గ్రిడ్, అనేక రకాలమొక్కలుతో అలంకరణ చేస్తారు. కొన్ని కంపెనీలు అయితే ఫ్యాన్సీ డెకర్, స్టాక్డ్ కిచెన్ లను కూడా ఏర్పాటు చేస్తున్నాయట. ఇదంతా ఉద్యోగులను ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపేలా చేయడానికట. రిటర్న్ టు ఆఫీస్ లో భాగంగా ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ఈ చర్యలు చేపడుతున్నారట.