లేట్ నైట్ నిద్ర.. ఆరోగ్యానికి హానికరం.. కొంతమంది బెడ్ ఎక్కగానే నిద్ర వస్తుంది.. మరికొంతమందికి ఎంత సేపటికి రాదు.. సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని అటూ ఇటూ తిరుగుతుంటారు. మరో విషయం ఏంటంటే అధిక బరువుతో బాధపడే వారు చాలా ఇబ్బందులు పడతారు. ఇలాంటి వారికి యాలకులు చాలా మేలు చేస్తాయని ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
యాలకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మనం తీసుకునే చాలా పదార్థాలు జీర్ణం కాక ఎసిడిటీ, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు యాలకులు తిని, గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆ సమస్య నుంచి బయ టపడొచ్చు.
ఈ మధ్య కాలంలో బరువును తగ్గేందుకు ఒక్కొక్కరు ఒక్కోరకమైన ప్రయ త్నం చేస్తున్నారు. త్వరగా బరువు తగ్గాలి అనుకునేవారు ప్రతిరోజూ ఒక యాలక్కాయ తిని, గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో అధిక బరువు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
►ALSO READ | ఉగాది 2026 : తెలుగు వారి తొలి ప్రకృతి పండుగ ఉగాది.. పురాణాల్లోని విశిష్ఠత అందరూ తెలుసుకోవాలి..!
రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తిని, గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా మంచిదం టున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ రాత్రివేళల్లో తీసుకుంటే ఔషధాలతో అవసరం ఉండదు. అంతేకాదు, శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టని వారికి యాలకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి.
–వెలుగు,లైఫ్–
